• search

ఐటీ ఉద్యోగాలు తగ్గితేనేం నో ప్రాబ్లం: మెట్రో పాలిటన్ నగరాలు కొలువుల కేంద్రాలు

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: హైటెక్‌ నగరంలో కొత్త కొలువుల 'జూమ్‌' అంటూ పెరుగుతున్నాయి. యువత ఆ కొలువుల వైపు పరిగెడుతోంది. ఆశించిన స్థాయిలో ఐటీ జాబ్స్‌ పెరగకున్నా సేవ, నిర్మాణ, ఇంజినీరింగ్, సేల్స్, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో లభిస్తున్న ఉపాధి అవకాశాలు యువతకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోన్న గ్రేటర్‌ హైదరాబాద్ నగరంలో కొత్త కొలువులు నిరుద్యోగులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పలు మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి ఉన్నదని తాజా సర్వేలో తేలింది. ప్రముఖ కొలువుల వెబ్‌సైట్‌ నౌకరీడాట్‌కామ్‌ తాజా అధ్యయనంలో ఈ సంగతి తేలింది.

   Good News for Techies Find Out More - Oneindia Telugu

   దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ తదితర మెట్రో నగరాల్లో పలు రంగాలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఆయా సిటీల్లో ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక, ఇన్సూరెన్స్‌ తదితర సంస్థల్లో ఉపాధి కల్పన, ఉద్యోగాల వృద్ధిరేటు 21 శాతం మేర నమోదైంది. అనూహ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో నాలుగు శాతం వృద్ధిరేటు తగ్గినట్లు తేలింది. ఇక ఐటీ అనుబంధ రంగాలు, బీపీఓ విభాగంలో ఎనిమిది శాతం వృద్ధిరేటు తగ్గడం గమనార్హం.

   మొదటి స్థానంలో బెంగళూరు
   విశ్వనగర బాటలో దూసుకుపోతున్న గ్రేటర్‌ హైదరాబాద్ నగరంలో సేవారంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర సంస్థలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, భారీ యంత్ర పరికరాలు, నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఇక ఇంజినీరింగ్, ఆటోమొబైల్స్, సేల్స్, మార్కెటింగ్, వాణిజ్య ప్రకటనల (అడ్వర్టైజింగ్‌) రంగాలు కూడా ఇటీవలి కాలంలో ఇతోధికంగా పురోగమిస్తున్నాయి. హైదరాబాద్‌లో మొత్తంగా ఈ రంగాల్లో సగటున ఏటా ఆరు శాతం మేర ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో బెంగళూరు నగరం 16 శాతం వృద్ధిరేటుతో తొలిస్థానంలో ఉంది. ఇక రెండోస్థానంలో నిలిచిన ముంబై, కోల్‌కతా మహానగరాల్లో 15 శాతం వృద్ధి నమోదైంది. మూడో స్థానంలో నిలిచిన చెన్నైలో తొమ్మిది శాతం.. నాలుగోస్థానంలో నిలిచిన హైదరాబాద్‌లో 6 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు వెల్లడైంది. ఇక దేశ రాజధాని 'హస్తిన'లో ఆయా రంగాల్లో సగటున తొమ్మిది శాతం తరుగుదల నమోదైనట్లు తేలింది.

   Jobs rising in Metropoliton Cities

   శరవేగంగా విస్తరిస్తున్న భారీ యంత్ర పరిశ్రమలు

   గ్రేటర్‌ హైదరాబాద్ కేంద్రంగా దేశ, విదేశాలకు చెందిన పలు ఆర్థిక, వాణిజ్య, బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రధానంగా ఇన్సూరెన్స్, పెట్టుబడుల రంగం పురోగమిస్తోంది. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. మరోవైపు పారిశ్రామికీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో భారీ యంత్ర పరికరాల పరిశ్రమలు వేగంగా విస్తరిస్తున్నాయి. టీఎస్‌ ఐపాస్‌తో పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులు మంజూరు చేస్తుండటంతో పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్ జనాభా కోటి కాగా వినియోగిస్తున్న వాహనాల సంఖ్య సుమారు 50 లక్షలు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి వాహనం ఉన్నదన్నమాట. ఈ నేపథ్యంలో నూతన వాహనాల కొనుగోలు, వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం ఆటోమొబైల్‌ రంగం వృద్ధి చెందడంతోపాటు పలువురికి ఉపాధి బాట చూపుతోంది.

   Jobs rising in Metropoliton Cities

   సేల్స్ రిప్రజెంటివ్స్‌కు అవకాశాలు పుష్కలం

   మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌ సంబంధిత పరిశ్రమలు, ఇన్‌ఫ్రా కంపెనీలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. దీంతో ఈ రంగాల్లో ఇటీవలికాలంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలో విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు విస్తరించడంతో ఇతర రాష్ట్రాలు, విదేశీయులు నగరానికి వలస వస్తున్నారు. వీరికి గృహ వసతి అత్యవసరంగా మారింది. శివార్లలో అల్పాదాయ, మధ్య ఆదాయ వర్గాలు, వేతన జీవులు స్వతంత్ర గృహాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో నిర్మాణ రంగం పుంజుకుంటోంది. అమ్మకాలకు కాదేది అనర్హం.. పిజ్జా, బర్గర్‌ మొదలు.. కాళ్లకు వేసుకునే షూస్, సాక్సులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఇంటి వద్దకే కావాల్సిన వస్తువులు అందించే సేల్స్‌ రిప్రజెంటేటివ్‌లకు పలు సంస్థలు భారీగా కొలువులు, వేతనాలు, కమీషన్లు ఆఫర్‌ చేస్తుండటం విశేషం. ఇక వివిధ వస్తువులు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, నిర్మాణ రంగ సంస్థల్లో మార్కెటింగ్‌ చేసేవారికి కొత్త కొలువులు స్వాగతం పలుకుతూనే ఉన్నాయి. ఇక దేశ, విదేశాల మల్టీబ్రాండెడ్‌ వస్తువులకు వాణిజ్య ప్రకటనలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రకటనల రంగం శరవేగంగా విస్తరిస్తోంది.

   English summary
   IT jobs curtailing because automation, coding, analytics and restrictions from America, Britan and Austrelia. But Today conditions different. Particularly Devoloping India creates so many offers in infrastructure, manufacturing and service sectors. Greater Hyderabad in fourth place.

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more