జానీ మాస్టర్ వివాదంలో కొత్త మలుపు ..పొలీసులను బురిడీ కొట్టించి పరార్
జానీ మాస్టర్ వివాదం కొత్త మలుపు తిరిగింది. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు జానీ మాస్టర్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో పాటు, ఫోన్ సైతం స్వీచ్ ఆఫ్ చేయడంతో పోలీసులు అక్కడ నుంచి వెనుతిరిగారు. ఆయన తొలుత నార్త్ ఇండియాలో ఉన్నారన్న సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులను జానీ మాస్టర్ బురిడీ కొట్టించి పారిపోయారని తెలుస్తోంది. దీంతో జానీ మాస్టర్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జానీమాస్టర్ లడఖ్‌లో ఉన్నట్టు సమాచారంతో పోలీసు బృందాలు లడఖ్ బయలుదేరాయి. మరోవైపు మైనల్ బాలికపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన్నట్టు పోలీసులు తెలిపారు.

మరోవైపు జానీ మాస్టర్‌పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు సినీ ఇండస్ట్రీ సైతం జానీ మాస్టర్ ఇష్యూపై సీరియస్‌గానే రియాక్ట్ అయింది. అత్యాచార ఆరోపణలతో ఫిలిం ఛాంబర్ సైతం జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకుంది.అతన్ని డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిజ నిర్ధారణ జరిగే వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని ఫిలిం ఛాంబర్ ఓ నోట్ విడుదల చేసింది.












Click it and Unblock the Notifications