వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌ను ఆపండి: షా ఫోన్, బాబు ఆవేదన ఇలా, అన్నీ చెప్తా.. రేవంత్ సంచలనం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం టిడిపిలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశంగా మారింది. రేవంత్ టిడిపిని వీడటం తెలంగాణ టిడిపికి పెద్ద దెబ్బ.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/కొడంగల్/అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం టిడిపిలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశంగా మారింది. రేవంత్ టిడిపిని వీడటం తెలంగాణ టిడిపికి పెద్ద దెబ్బ.

చదవండి: ఆ సస్పెన్స్ కూడా బద్దలు కొట్టిన రేవంత్: ఎమ్మెల్యే పదవికి రాజీనామా..

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. రేవంత్ వ్యవహారంపై టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది.

చదవండి: పోతే పో, ఉంటే ఉండు!: రేవంత్‌కు 'బిగ్' షాక్, ఇదీ బాబు ప్లాన్, దూళిపాళ్ల సంధి ప్రయత్నం విఫలం

రేవంత్ బయటకు వెళ్లకుండా ఆపండి

రేవంత్ బయటకు వెళ్లకుండా ఆపండి

తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి బయటకు వెళ్లకుండా ఆపాలని చంద్రబాబుకు బీజేపీ చీఫ్ అమిత్ షా ఫోన్ చేసి కోరినట్లుగా తెలుస్తోంది. రేవంత్ శనివారం నాడు టిడిపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Recommended Video

Revanth Reddy Issue : నోరు విప్పని రేవంత్, మోత్కుపల్లికి షాక్, రేపు కీలక మీటింగ్ | Oneindia Telugu
కాంగ్రెస్ పార్టీలో చేరకుండా నిలువరించండి

కాంగ్రెస్ పార్టీలో చేరకుండా నిలువరించండి

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా నిలువరించాలని చంద్రబాబును అమిత్ షా కోరారని తెలుస్తోంది. అంతేకాదు, తెలంగాణలో బిజెపి - టిడిపి పొత్తులపై చర్చిద్దామని కూడా చెప్పారని సమాచారం.

బీజేపీ నేతలు అతి చేశారు

బీజేపీ నేతలు అతి చేశారు

అయితే తెలంగాణ బీజేపీ నేతలు అతి చేశారని అమిత్ షాకు చంద్రబాబు చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు ఉండదని, తెలంగాణలో టీడీపీయే లేదని గతంలో కమలం పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారని తెలుస్తోంది.

రేవంత్ వ్యవహారం చేజారిపోయింది

రేవంత్ వ్యవహారం చేజారిపోయింది

రేవంత్ రెడ్డి వ్యవహారం చేజారిపోయిందని చంద్రబాబు.. అమిత్ షాకు చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను ఆపే పరిస్థితి లేదని చెప్పారని సమాచారం.

రేవంత్ రాజీనామాపై చంద్రబాబు

రేవంత్ రాజీనామాపై చంద్రబాబు

రేవంత్ రెడ్డి రాజీనామాపై చంద్రబాబు మీడియాతో రెండుసార్లు స్పందించారు. కొంతమంది వారి ప్రయోజనాలు, భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటారని, టిడిపిలో ఇలాంటి పరిణామాలు కొత్త కాదన్నారు. కాగా, వచ్చే నెలలో రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారు. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఆదివారం అన్నీ మాట్లాడుతా, బాబుతో భేటీ జరగలేదు

ఆదివారం అన్నీ మాట్లాడుతా, బాబుతో భేటీ జరగలేదు

టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన అనంతరం రేవంత్ రెడ్డి కొడంగల్ వచ్చారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయన చంద్రబాబుతో భేటీ కోసం విజయవాడ వెళ్లారు. కానీ ముఖాముఖి లేకుండానే వచ్చారు. శనివారం రాత్రి కొడంగల్ చేరుకున్న రేవంత్.. రేపు ఉదయం అన్నీ మాట్లాడుతానని చెప్పారు.

ఆదివారం మాట్లాడుతా, అందరూ రండి

ఆదివారం మాట్లాడుతా, అందరూ రండి

ఆయన ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. ఇప్పుడు రాత్రి అయిందని, అందరూ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లాలని, ఆదివారం పొద్దున తొమ్మిది గంటలకు అన్ని విషయాలు మాట్లాడుతాని, తప్పకుండా అందరూ రావాలన్నారు.

ప్రాణాలు ఇచ్చైనా ముఖ్యమంత్రిని చేస్తాం

ప్రాణాలు ఇచ్చైనా ముఖ్యమంత్రిని చేస్తాం

రేవంత్ ఇంట్లోకి వెళ్లిన అనంతరం ఆయన అభిమానులు కొందరు మీడియాతో మాట్లాడారు. రేవంత్ ఏ పార్టీలో ఉన్నారనేది తమకు ముఖ్యం కాదని, కొడంగల్ అభివృద్ధి మాకు ముఖ్యమని, ఇప్పటికీ ప్రజలంతా రేవంత్ వెంట ఉన్నారని, వెనుకబడ్డ కొడంగల్ పేరును ఢిల్లీ దాకా తీసుకు వెళ్లిన రేవంత్‌ను ఏ పార్టీ నుంచి అయినా గెలిపిస్తామని, మా ప్రాణాలు ఇచ్చి అయినా ఆయనను సీఎంను చేస్తామని చెప్పారు.

English summary
The Telugu Desam Party (TDP) received a setback in Telangana on Saturday as the state working president and firebrand MLA, A Revanth Reddy, resigned from the party saying the recent happenings in the state unit pained him. He resigned from the MLA post as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X