రేవంత్ రాకతో పార్టీలో జోష్ వచ్చింది సరే.!మరి చేరికల మాటేంటి.!ఎందుకు బ్రేక్ పడుతోంది.?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పుంజుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంది. కొత్త ఛీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పూర్వవైభవం అందుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పీసీసీ అధ్యక్షుడి నియామకంలో పార్టీ కేడర్ లో ఉత్సాహం కనిపిస్తోంది. బహిరంగ సభలతో కార్యకర్తల్లో జోష్ నింపుతూ సత్తా నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి సన్నిహితులు క్షత్ర స్ధాయిలో కష్టించి పనిచేస్తున్నారు. చంద్రశేఖర్ రావు ప్రభుత్వంపైన వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తూ ప్రజాభిమానం చూరగొనడానికి శ్రమిస్తున్నట్టు కనిప్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం పార్టీ శ్రేణులను మానసికంగా దెబ్బతీసినప్పటికి రేవంత్ రెడ్డి దూకుడు మాత్రం కొనసాగుతూనే ఉందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది.

రేవంత్ రాకతో ఊపిరి పోసుకున్న తెలంగాణ కాంగ్రెస్.. కార్యకర్తల్లో రెట్టింపైన ఉత్సాహం
అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటూనే బీజేపీని నిలువరించడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి అనేక సవాళ్లు ఎదుర్కొనే సరిస్ధితులు తలెత్తాయి. సొంత పార్టీ అసమ్మతి నేతల అసమ్మతి చర్యలతో రేవంత్ రెడ్డి అనుకున్నంత దూకుడుగా పార్టీని పరుగులు పెట్టించలేకపోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవి దక్కలేదన్న ఆగ్రహంతో ఉన్న కొందరు సీనియర్లు, తమకంటే జూనియర్ కు పదవి వచ్చిందన్న భావనతో రేవంత్ కు సహకరించడం లేదనే చర్చ కూడా జరగుతోంది. ఎదో విధంగా రేవంత్ ను నిలువరించే ప్రయత్నాలు ప్రత్యర్థి వర్గం నుంచి ఎదురవుతూనే ఉన్నాయి అనడానికి ఆఘమేఘాల మీద రేవంత్ ఢిల్లీ పర్యటన స్పష్టం చేస్తోంది.

దూకుడుగా అడులేస్తున్న రేవంత్.. కానీ అంతగా లేని చేరికలు..
రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర పార్టీ నేతల చూపు కాంగ్రెస్ పైన పడిందన తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల్లో ఉన్న కొంత మంది నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెర వెనక గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయా పార్టీల్లో నిరుత్సాహంగా ఉన్న నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒకరిద్దరు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కూడా. అయితే ఎక్కువ చోట్ల చేరికలకు సొంత పార్టీ నేతలే అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న ఇతర పార్టీ నేతలను ఏవో కారణాలు చూపిస్తూ అయా జిల్లాల కాంగ్రెస్ నేతలు నిలిపేస్తున్నట్టు తెలుస్తోంది.

సొంతపార్టీ నేతల అభ్యంతరాలు.. ఆగిపోతున్న చేరికలు..
అందులో భాగంగా జడ్చర్ల లో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, నిజామాబాద్ లో ధర్మపురి సంజయ్, ఉపాధ్యాయ సంఘ నేత హర్షవర్థన్ రెడ్డి వంటి వారు కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వచ్చారు. ఎర్రశేఖర్ ఏకంగా మహబూబ్ నగర్ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి మరి రేవంత్ రెడ్డిని కలిశారు. కాని ఆయన చేరికకు ఇప్పటి వరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఎర్రశేఖర్ పార్టీలో చేరడాన్ని కొంత మంది నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇక నిజామాబాద్ లో ధర్మపురి సంజయ్ చేరికకు చాలా మంది కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదనే చర్చ జరుగుతోంది. మధుయాష్కీ, మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర నాయకులు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.
Recommended Video

వైచిచూసే ధోరణిలో రేవంత్ రెడ్డి.. కాలమే మార్పు తెస్తుందన్న పీసిసి ఛీఫ్..
ఈ విషయంలో రేవంత్ రెడ్డి కి పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరాలను ఏకరువుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ధర్మపురి సంజయ్ చేరిక పైన పీసీసీ నిర్ణయం తీసుకోలేకపోతోంది. మరో వైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ సంఘ నేత హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. కాని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆయన రాకకు అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన హర్షవర్థన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని స్పష్టం చేస్తున్నారు చిన్నారెడ్డి. దీంతో రేవంత్ రెడ్డి డైలమాలో పడ్డాట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో చాలా చోట్ల పార్టీలో చేరికలకు ఇతర పార్టీ నేతలు సిద్దమౌతున్నప్పటికి సొంత పార్టీ నేతలు అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో పీసిసి వెయిట్ అండ్ సీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications