Mohan Babu: మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి..!

సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ జర్నలిస్ట్ ఆందోళనకు దిగాయి. బుధవారం ఫిల్మ్ ఛాంబర్ ముందు సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ కలిసి భారీ ఎత్తున జర్నలిస్టులు నల్ల బ్యాడ్జిలు ధరించి అక్కడే ధర్నా చేపట్టారు. జర్నలిస్ట్ పై దాడి చేసిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని అల్లం నారాయణ డిమాండ్ చేశారు. మోహన్ బాబుపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సీనియర్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు.

మోహన్ బాబు జర్నలిస్టుపై ఓ ఉన్మాదిలా దాడి చేశారని ఆరోపించారు. రంజిత్‌ తీవ్రంగా గాయపరచడాన్ని వారు ఖండించారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు మోహన్ బాబు క్షమాపణలు చెప్పలేదని చెప్పలేదని గుర్తు చేశారు. వాళ్ల కుటుంబ సమస్య బజారున పడ్డాకే మీడియా అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు.
మంగళవారం మీడియా పై జరిగింది ముమ్మటికీ క్రూరమైన దాడేనని అన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అటు మోహన్ బాబు ఇంటి ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.

Journalist associations demand Mohan Babu s arrest

ఈ క్రమంలోనే విచారణకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన మంచు మనోజ్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. కాగా మోహన్ బాబుపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన నోటీసులు కూడా పంపారు. దీనిపై మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్డు మోహన్ బాబు ఊరట కల్పించింది. పోలీసుల ముందు విచారణను మినహాయించింది. కేసును డిసెంబర్ 24 తేదీకి వాయిదా వేసింది. అయితే మోహన్ బాబు తరఫు న్యాయవాది మోహన్ బాబు ఇంటి వద్ధ భద్రత ఏర్పాటు చేయాలని కోరారు.

దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ఇంటి వద్ద పోలీసు సెక్యూరిటీ సాధ్యం కాదన్నారు. రెండు గంటలకు ఒకసారి పోలీసులు వెళ్లి పరిస్థితి సమీక్షించాలని ఆదేశించింది. ప్రస్తుతం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటర్ ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఎడమ కన్నుకు గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఉదయం మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+