విషాదం: చిన్నారులతోపాటు జర్నలిస్టు కుటుంబం ఆత్మహత్య, భార్య పరిస్థితి విషమం
సిద్దిపేట: నగరంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. భరత్‌నగర్‌లో ఓ కుటుంబం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌నగర్‌లో ఉంటున్న కొండపాక మండలం వెలికట్ట గ్రామానికి చెందిన హనుమంతరావు అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

గమనించిన చుట్టుపక్కలవారు ఆస్పత్రికి తరలించే లోపే హనుమంతరావుతోపాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. హనుమంతరావు భార్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, హనుమంతరావు ఓ వార్తా పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హనుమంతరావు కుటుంబం ఆత్మహత్య పై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి తెలిపారు. జర్నలిస్ట్ మృతి పట్ల సంతాప ప్రకటించిన మంత్రి హరీష్ రావు.. జర్నలిస్ట్ భార్యకు మెరుగైన వైద్య చికిత్స అందిచాలని వైద్యులను ఆదేశించారు. జర్నలిస్ట్‌లకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకరావాలని ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదని కోరుకున్నారు.












Click it and Unblock the Notifications