ఆ స్థానం మరెవ్వరికీ దక్కదు: ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ ఎన్టీఆర్
నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట డైరెక్టర్ కొరటాల శివ తదితరులు ఉన్నారు.
హైదరాబాద్: నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం హైదరాబాదులోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లోని తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట డైరెక్టర్ కొరటాల శివ తదితరులు ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఉదయం అయిదున్నర గంటల సమయంలో ఎన్టీఆర్ ఘాట్ వచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు.

తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆ స్థానం మరెవ్వరికీ దక్కదన్నారు. తెలుగు వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయన్నారు. ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, రామకృష్ణ సహా పలువురు కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications