ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం.. !
తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారం అధికారికంగా ముగిసింది. 11వ తేదీన ఉపఎన్నిక పోలింగ్ ఉండటంతో 48 గంటల ముందుగా ప్రచారాన్ని ఆపేశాయి. దాదాపు 17 రోజుల పాటు మూడు ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ర్యాలీలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో హోరెత్తించాయి. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దృష్టి నిలిచింది. 14వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లు లెక్కించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురి మధ్యనే తుది పోటీ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారని.. మొత్తం 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని స్పష్టం చేశారు. కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఎన్నికల సామగ్రిని రేపు ( 10 నవంబర్ 2025 ) పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని.. అన్నింట్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. ఈ సారి కొత్తగా డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుందని ఆర్వీ కర్ణన్ వివరించారు.

అంతే కాకుండా మొత్తంగా 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రచార పర్వం ముగిసిన వెంటనే పారామిలిటరీ బలగాలను రంగంలోకి దింపి బందోబస్తుకు ఆదేశించారు. విధుల్లో మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అలానే జీహెచ్‌ఎంసీ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా.. పోలింగ్ ముగిసేవరకు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ సీపీ తఫ్సిర్ ఇక్బాల్ అన్నారు. 1761 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని నాన్ లోకల్స్ అందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బయటకు పంపిస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో ఉందని ఎలాంటి అవాంచిత ఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది రెడీగా ఉందన్నారు. ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
ఇక ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద 27 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయినట్లు జాయింట్ సీపీ తెలిపారు. ఫిల్మ్ నగర్ జోన్ లో 6, బంజారాహిల్స్ లో 1, బోరబండలో 7, జూబ్లీహిల్స్ 3, మధురనగర్ లో 6, టౌలీచౌకిలో 2, సనత్ నగర్ లో 2 రెండు కేసులు నమోదయ్యాయని ప్రకటించారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications