2028 అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్లు ఎటువైపో చెప్పేసే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

2028లో తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఉన్న సెటిలర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనే విషయాన్ని నవంబరు 11వ తేదీన జరగబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చెప్పేస్తుంది. 14వ తేదీన ఫలితాలు వస్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీవైపు ఓటర్లు మొగ్గుచూపినప్పటికీ హైదరాబాద్ నగరంలోని ఓటర్లు మాత్రం భారత రాష్ట్ర సమితివైపు ఎక్కువగా మొగ్గుచూపారు. అందులో ప్రధానంగా సెటిలర్లంతా బీఆర్ఎస్ కు ఓటేశారు.

దీనికి అనేక కారణాలున్నాయి. వారిని వ్యాపారాలు చేసుకోనివ్వమని బెదిరించడం, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తామని ఆ పార్టీ నేతలు బెదిరించడం... తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో అనవసరంగా సెంటిమెంట్ ను రెచ్చగొట్టి తమను ఇబ్బందులకు గురిచేస్తారనే ఉద్దేశంతో సెటిలర్లలో 80 శాతం ఓట్లు బీఆర్ఎస్ కే పడ్డాయి.

Jubilee Hills by-election will be a deciding factor for settlers in the 2028 assembly elections

కేటీఆర్ పై తీవ్ర అసంతృప్తి
తర్వాత కాంగ్రెస్ గెలవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో వీరంతా సంతోషంగా ఉన్నారు. మరోవైపు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం, కేంద్రంలో ఎన్డీయేకు టీడీపీ మద్దతు కీలకం కావడం, చంద్రబాబు ప్రియ శిష్యుడు రేవంత్ సీఎంగా ఉండటంతో వీరంతా ఎటువంటి ఆటంకాలు ఎదుర్కొనకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వీరంతా కాంగ్రెస్ కు ఓటేస్తారనే అంచనాలున్నాయి.

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై మొన్నటివరకు అందరికీ మంచి అభిప్రాయం ఉండేది. కానీ అతను చేసిన అవినీతి, అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసిన దారుణాలన్నీ వెలుగులోకి వస్తుండటంతో అందరూ అతన్ని చీదరించుకుంటున్నారు. దీనికి తగినట్లుగానే కేటీఆర్ కూడా అదుపు తప్పి మాట్లాడటం, అతను కానీ, అతని తండ్రికానీ రేవంత్ ముఖ్యమంత్రి అవడాన్ని జీర్ణించుకోలేకపోవడం.. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ఈ రెండు ఎన్నికలే నిర్ణయిస్తాయి
2018 ఎన్నికల్లో సెటిలర్ల చేత బలవంతంగా ఓట్లు వేయించుకున్నారు. కానీ వారికి ఇష్టమైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో అవకాశాన్ని వదులుకోరని భావిస్తున్నారు. అధిక శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్ కు ఆ మాత్రమైనా సీట్లు వచ్చాయంటే అందుకు నగరమే ప్రధాన కారణం. అటువంటి హైదరాబాద్ నగరంలో ఆ పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో ఉన్న రేవంత్ అందుకు తగిన వ్యూహాలు రచించుకుంటూ వస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్ల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను కూడా సెటిలర్ల మద్దతుతో గెలుచుకోవాలనుకుంటున్నారు. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడినట్లేననే అంచనాలున్నాయి. అవి నిజమవ్వాలంటే ఈ రెండు ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఎదురు చూడాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+