రేవంత్‌కు బెయిల్ రావొచ్చు: లాయర్, జడ్జి సంధించిన ప్రశ్నలు.., ఏసీబీకి ఫోరెన్సిక్ ఒకే
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది సిద్దార్థ లూద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన రేవంత్ రెడ్డికి ఐదేళ్ల శిక్ష పడే అవకాశముందని ఏసీబీ న్యాయవాది ఏజీ రామకృష్ణా రెడ్డి వాదనల సందర్భంగా అభిప్రాయపడ్డారన్నారు.
దీంతో రేవంత్ రెడ్డికి బెయిల్‌కు అవకాశముందన్నారు. నిందితుడు ఓ ప్రజాప్రతినిధిగా ఉన్నందున దేశం విడిచిపోయే అవకాశం లేదని, నియోజకవర్గ ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు బెయిల్ ఇవ్వలని కోర్టును కోరినట్లు మీడియాకు తెలిపారు.
న్యాయమూర్తి లాయర్లను పలు ప్రశ్నలు అడిగారు. అసలు రేవంత్ రెడ్డికి బెయిల్ ఎందుకివ్వాలని జడ్జి రేవంత్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.

దానికి సమాధానంగా రేవంత్ ఏసీబీ కస్టడీ ముగియగానే తిరిగి జైలుకు వెళ్లారని, తర్వాత ఆయన కూతురు నిశ్చితార్థం కోసం కోర్టు 12 గంటల బెయిల్ ఇచ్చిందని, సాయంత్రం ఆరు గంటల సమయం ఉన్నా ఒక గంట ముందుగానే రేవంత్ తిరిగి జైలుకు వెళ్లారని, అంటే బెయిల్ షరతులను అమలు చేయడంలో అతను ఏ విధంగా ఉంటాడన్న విషయాన్ని ఒక ఉదాహరణగా చెప్పారు. రేవంత్ విచారణకు సహకరిస్తారన్నారు.
రేవంత్ రెడ్డికి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. రేవంత్‌కు బెయిల్ ఇస్తే విచారణ ఏవిధంగా ప్రభావితం చేస్తారో వివరించారు. బెయిల్ ఇవ్వకూడదన్న అడ్వకేట్ జనరల్ వాదనలల్లో ఏడు వాదనలకు జడ్జీ రెండింటిని అంగీకరించారు.
కస్టడీలో రేవంత్ రెడ్డి ఏమి చెప్పలేదా అని ఏజీని జడ్జీ ప్రశ్నించారు. ఈ కేసులో కుట్ర ఉందని, 10 మంది ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వం పడిపోయేదని కోర్టులో వాదించారు. బెయిల్ ఇస్తే సాక్షులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఎమ్మెల్సీ స్థానాలకు ఎంతమంది పోటీ చేశారని న్యాయమూర్తి అడిగారు. ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ చేశారని న్యాయవాది చెప్పారు. కాగా, కస్టడీ వివరాలను వెల్లడించేందుకు రేవంత్ నిరాకరించారన్నారు.
ఈ సందర్భంగా కేసులో శిక్ష ఎంత పడుతుందో తెలుసా అని జడ్జి అడిగారు. కనిష్టంగా ఆరు నెలలు, గరిష్టంగా ఐదేళ్లు అన్నారు. దానికి జడ్జి స్పందిస్తూ.. కేసులను బట్టి తీర్పులు మారుతాయన్నారు. రేవంత్ న్యాయవాది, ఏజీ కలిసి దాదాపు గంటసేపు వాదనలు వినిపించారు.
కిక్కిరిసిన హాలు
రేవంత్ బెయిల్ పిటిషన్ పైన విచారణ నేపథ్యంలో కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. రేవంత్ రెడ్డి మద్దతుదారులతో పాటు ఈ కేసు పట్ల ఆసక్తితో కోరుటు హాలు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇదిలా ఉండగా, రేవంత్ బెయిల్ పిటిషన్ పైన వాదనలు ముగిశాయి. తీర్పు మంగళవారం (30వ తేదీన) వెలువడనుంది.
ఫోరెన్సిక్ నుండి అనుమతి తీసుకున్న ఏసీబీ
ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి సీల్డ్ కవర్‌లో సమర్పించిన నివేదిక కోసం ఏసీబీ అధికారులు ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్స్) నుండి అనుమతి తీసుకుంది. ఆ కాపీని కోర్టుకు సమర్పించనున్నారు. దీని అనంతరం మరికొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశముంది.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు











Click it and Unblock the Notifications