మత్తయ్యకు సోమవారందాకా ఊరట: రేవంత్ బెయిల్ కోసం పూజలు
హైదరాబాద్: హైకోర్టులో స్టీఫెన్ సన్ పిటిషన్ పైన గురువారం నాడు వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పు సోమవారానికి వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య అరెస్టు పైన విధించిన స్టేను ఎత్తివేయాలని, అలాగే జడ్జిని మార్చాలని స్టీఫెన్ కోర్టును ఆశ్రయించారు.
దీనిపై వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. దీంతో, మత్తయ్య అరెస్టు పైన స్టే సోమవారం వరకు కొనసాగనుంది. కాగా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని హైకోర్టు ప్రశ్నించింది.

కాగా, మత్తయ్య స్క్వాష్ పిటిషన్‌పై విచారణను స్వీకరించిన హైకోర్టు తొలుత బుధవారం నాడు ఈ రోజుకు (గురువారానికి) వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మత్తయ్య అరెస్టుపై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.
రేవంత్ రెడ్డికి బెయిల్ రావాలని పూజలు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ రావాలని వనస్థలిపురంలోని ప్రశాంతినగర్ సాయిబాబా ఆలయంలో టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications