వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్టీ, ఆధార్-పాన్ లింకే కాదు ఇంకెన్నో: జూలై 1 నుంచి షాకింగ్ మార్పులు

జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది. దేశ ముఖచిత్రాన్నే మార్చేయగల వస్తు సేవల పన్ను (జిఎస్టీ) ఆ రోజు నుంచి అమల్లోకి రానుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది. దేశ ముఖచిత్రాన్నే మార్చేయగల వస్తు సేవల పన్ను (జిఎస్టీ) ఆ రోజు నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు, ఆధార్ - పాన్ కార్డ్ లింక్‌కు రెండు రోజులే సమయం ఉంది.

<strong>మిగిలింది 2రోజులే: పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి, ఇలా చేయండి</strong>మిగిలింది 2రోజులే: పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి, ఇలా చేయండి

ఇవే కాకుండా మనలను ఎంతగానో ప్రభావితం చేసే ఎన్నో కొత్త అంశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. అందులో...

 July 1 will change your world: Be prepared for changes other than GST

ఆధార్ లేకుండా ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం జూలై 1 నుంచి సాధ్యపడదు.

కేంద్రం ఆధార్ - పాన్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. ఎవరైనా అలా అనుసంధానం చేసుకోకుంటే కొన్నాళ్లకు వారి పాన్ పనికి రాకుండా పోతుంది.

మీకు ఆధార్ లేకుంటే జూలై 1వ తేదీ నుంచి పాన్ కార్డు పొందడం కుదరదు. పాన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు శనివారం నుంచి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ జత చేయాలి.

పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయాలనుకుంటే తప్పనిసరి.. జాబితాలో ఆధార్ ఒకటి. జూలై 1 నుంచి ఆధార్ లేకుండా పాస్‌పోర్టు పొందడం అసాధ్యం.

జూన్ 30వ తేదీ లోగా ఆధార్ వివరాలు అందించాలని ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్లు తమ ఆధార్ వివరాలు వెల్లడించాలని చెప్పింది. ఆధార్ లింక్ వల్ల ఉద్యోగ విరమణ సమయంలో సెటిల్మెంట్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందంటున్నారు.

రాయితీల్లో రైల్వే టిక్కెట్లు పొందేవారు జూలై 1 నంచి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఇవ్వాలి.

జూలై 1వ తేదీ నుంచి రేషన్ సరుకులు తీసుకునే వారు ఆధార్‌తో రేషన్ అనుసంధానం చేయాల్సిందే.

స్కాలర్ షిప్పులు తదితరాలకు ఆధార్ వివరాలు ఇవ్వాలి.

English summary
July 1 is set to enter into history books, and not just for the Goods and Services Tax (GST). A number of other major changes will happen from this date.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X