జెఎన్ టియూ క్యాంపస్ లో బట్టల్లేకుండా పరుగెత్తించారు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ :ర్యాగింగ్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతోన్న ర్యాగింగ్ కు గురై ఇబ్బందులకు పడే విధ్యార్థుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. సీనియర్లు జూనియర్లను వేధించడంతో ఆగ్రహానికి గురైన జూనియర్లు సీనియర్లపై తిరుగుబాటు చేశారు.ఈ ఘటన హైద్రాబాద్ జెఎన్ టి యూ లో చోటుచేసుకొంది.

హైద్రాబాద్ లోని జెఎన్ టి యూలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తోన్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా ఇదే తరహ ఘటన ఒకటి వెలుగుచూసింది. ఈ ఘటనతో జూనియర్లు సీనియర్ల వైఖరిని నిరసిస్తూ జెఎన్ టి యూ క్యాంపస్ లో ఆందోళనకు దిగారు. జూనియర్లకు విధ్యార్థఇ సంఘాలు కూడ మద్దతు పలికాయి.

junior student run without clothes ,in jntu campus

కూకట్ పల్లిలోని జెఎన్ టియూ లో బిటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విథ్యార్థి పై సీనియర్లు మంగళవారం రాత్రి ర్యాగింగ్ కు పాల్పడ్డారు. జూనియర్ విధ్యార్థి ని బట్టల్లేకుండా యూనివర్శిటీ లో పరుగెత్తించారు. ఈ ఘటనతో జూనియర్లు సీనియర్ల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్లపై చర్య తీసుకోవాలని కోరుతూ బుదవారం నాడు జెఎన్ టి యూ ఎదుట ధర్నాకు దిగారు.

బిటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విధ్యార్థి పై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడడంతో జూనియర్లు చేపట్టిన ఆందోళనకు విధ్యార్థి సంఘాలు కూడ మద్దతు పలికాయి. అనాగరికంగా బట్టల్లేకుండా ఆ విధ్యార్థినిని పరుగెత్తించడాన్ని జూనియర్లు తప్పుబట్టారు. ఈ విషయంపై ఆందోళన చేస్తున్నారు.ర్యాగింగ్ కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని విధ్యార్థులు కోరుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
seniors ragging on junior student in hyderabad jntu campus. who has studying b,tech first year ragging senior students. junior students protest against seniors in front of jntu gate at kukatpally. students organations support this protest.
Please Wait while comments are loading...