ఎమ్మెల్యేల ఫైటింగ్‌పై మంత్రి జూపల్లి: ఇద్దరిదీ తప్పుంది, చట్ట ప్రకారమే చర్యలు

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన వివాదం వ్యక్తిగమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామమోహన్ రెడ్డి బూతులు తిడితేనే బాలరాజు స్పందించారని ఆయన అన్నారు.

విపక్షాలు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే దీనిని వివాదం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇద్దరు ఎమ్మెల్యేల వ్యక్తిగత సమస్యపై జిల్లా బంద్ చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాగా, గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డిని రక్షించుకునేందుకు యత్నిస్తోందని జూపల్లి విమర్శించారు.

Jupally Krishna Rao says disputes of two mlas totally personal

ప్రజా సమస్యలు పట్టకుండా రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ వివాదంలో ఇద్దరు నేతలదీ తప్పు ఉందని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని అన్నారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను జైళ్లలో పెట్టినప్పుడు కాంగ్రెస్‌ ఎందుకు బంద్‌కు పిలుపునివ్వలేదని జూపల్లి ప్రశ్నించారు. రామ్మోహన్‌రెడ్డి మృదు స్వభావి కాదని, ముదురు స్వభావి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ సినియర్ నేత జానారెడ్డి తెలిసి తెలియక మాట్లాడుతున్నారని అన్నారు. ఓయూ విద్యార్థులపై దానం నాగేందర్‌ దాడి చేయలేదా? అని జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.

తెలంగాణలో అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయిని మండిపడ్డారు. పాలమూరు కరువుపై మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ఆగడాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో హైదరాబాద్‌కు తాగడానికి నీళ్లివ్వకుండా ఏపీకి మూడో పంటకు నీళ్లిచ్చారని గుర్తు చేశారు.

తెలంగాణ కోసం ఒక్కరోజైనా మాట్లాడని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి చెంపపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాలరాజు కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనకు నిరసనగా శనివారం తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. టిఆర్ఎస్‌ది అధికార మదం అని కాంగ్రెస్ నేతలు డికె అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, జానా రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. తాము తలచుకుంటే టిఆర్ఎస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+