కావాలనే కెసిఆర్ గైర్హాజర్: జూపూడి, డిఎస్‌పై షబ్బీర్ విశ్వాసం
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కావాలనే తిరస్కరించారని తెలుగుదేశం పార్టీ జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతితో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమైతే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని భావించామని అన్నారు.
కేసీఆర్‌కు ఏ జ్వరం వచ్చిందో తెలియదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఇరు రాష్ర్టాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే విధానాలే కనిపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చినప్పుడు, కలిసి కూర్చోనే అవకాశం వచ్చినప్ప్డుడు, ఈ అవకాశాన్ని కేసీఆర్ ఎందుకు ఉపయోగించలేదో అర్థం కావడం లేదని జూపూడి విమర్శించారు.

దూర దృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ పార్టీలుగా విమర్శించుకుందామని, కానీ పరిపాలన వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలను కలిసి కూర్చోని మాట్లాడుకుందామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నామని, సీఎం కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని జూపూడి కోరారు.
తమ పార్టీ సీనియర్ నేత డి. శ్రీనివాస్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్తారని భావించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెప్పారు. యూనివర్సిటీలకు వీసీలు లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణాయేనన్నారు. వీసీలు లేకుండా యూనివర్సిటీలు ఎలా నడుస్తాయని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications