వివాహేతర సంబంధంతో మహిళ దారుణ హత్య.. కోర్టు సంచలన తీర్పు
మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2011లో ఈ ఘటన జరగ్గా 14 ఏళ్ల తర్వాత తీర్పును వెల్లడించింది. మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు దోషికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. 2011 జులై 18న సనత్ నగర్ పీఎస్ పరిధిలోని మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా కోర్టు తీర్పును వెల్లడించింది.
ఇల్లీగల్ ఎఫైర్ కారణంతో మహిళ దారుణ హత్య కేసులో మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. దోషికి మరణశిక్ష విధించింది. మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో 14 ఏళ్ల తర్వాత మేడ్చల్ జిల్లా కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఈ ఘటన సనత్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ లో 2011 జులై 18న జరిగింది. కర్ణాటకకు చెందిన కరణ్ సింగ్ అనే వ్యక్తి.. సదరు మహిళను దారుణంగా హత్య చేశాడు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు మరణశిక్షతో పాటుగా రూ.10 వేలు జరిమానా విధించింది.

మరో ఘటనలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 జూన్ లో నమోదైన పోక్సో కేసులో భాగంగా దోషికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు ఇచ్చారు.












Click it and Unblock the Notifications