హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్టుబడులతో తరలిరండి: డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్ ప్రసంగం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

బీజింగ్/హైదరాబాద్: భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు పెట్టుబడులతో రండి, కలిసి పనిచేసి పరస్పరం అభివృద్ధి చెందుదామని చైనా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

అత్యద్భుతమైన పారిశ్రామిక విధానం తెచ్చామని, వినూత్న సంక్షేమ పథకాలతో ముందుకుసాగుతున్నామని.. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి విషయంలో ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టుదలతో సంస్కరణలు అమలు చేస్తున్నారని చెప్పారు.

భారత్‌ పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతమని, దేశంలో ప్రత్యేకించి.. తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పారిశ్రామికవేత్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

‘భారత దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రవేశపెట్టింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం' అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. చైనాలోని డాలియన్ నగరంలో బుధవారం ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) సదస్సులో ‘వాణిజ్యంలో వర్ధమాన దేశాల గమ్యం' అంశంపై సిఎం కెసిఆర్ ప్రసంగించారు.

తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతమైన, అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. రెండు వారాల్లోనే పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులు సింగిల్ విండోలో పొందే చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించకుంటే సంబంధిత అధికారులకు అపరాధ రుసుం విధించేలా చట్టం ఉంటుందని వివరించారు.

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు పెట్టుబడులతో రండి, కలిసి పనిచేసి పరస్పరం అభివృద్ధి చెందుదామని చైనా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

అత్యద్భుతమైన పారిశ్రామిక విధానం తెచ్చామని, వినూత్న సంక్షేమ పథకాలతో ముందుకుసాగుతున్నామని.. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి విషయంలో ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోందని పేర్కొన్నారు.

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్టుదలతో సంస్కరణలు అమలు చేస్తున్నారని చెప్పారు.

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

భారత్‌ పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతమని, దేశంలో ప్రత్యేకించి.. తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ పారిశ్రామికవేత్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

‘భారత దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రవేశపెట్టింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం' అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

చైనాలోని డాలియన్ నగరంలో బుధవారం ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) సదస్సులో ‘వాణిజ్యంలో వర్ధమాన దేశాల గమ్యం' అంశంపై సిఎం కెసిఆర్ ప్రసంగించారు.

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

డబ్ల్యూఈఎఫ్‌లో కెసిఆర్

తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ అద్భుతమైన, అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు. రెండు వారాల్లోనే పరిశ్రమల స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులు సింగిల్ విండోలో పొందే చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు.

తమ పారిశ్రామిక విధానానికి ఆకర్షితులై మూడు నెలల్లోనే 56 పెద్ద కంపెనీలు రూ.12 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని వివరించారు. ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ భారత్ కలిగివుంటే, తమ దేశంలో పెద్ద మార్కెట్ కలిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. తమకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయంపై దశాబ్దంన్నర పాటు పోరాడి 15నెలల కిందట ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు కెసిఆర్ వివరించారు.

ఉమ్మడి రాష్ట్ర ప్రయోగం విఫలం కావడం వల్లే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశాం తప్ప, తమది వేర్పాటువాద ఉద్యమం కాదని అన్నారు. ‘రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఉచితంగా కట్టిస్తున్నాం. ఇంటింటికి మంచినీరు సరఫరా చేసేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అంతర్జాతీయస్థాయి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం' అని సిఎం కెసిఆర్ వివరించారు.

సదస్సు విరామ సమయంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ చైర్మన్ క్లౌస్ స్కాబ్‌తో సిఎం కెసిఆర్ కొద్దిసేపు సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంలోని ముఖ్యాంశాలను ఆయనకు సిఎం కెసిఆర్ వివరించారు. తదుపరి డబ్ల్యూఎఫ్ సమావేశం హైదరాబాద్ నిర్వహించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ కోరారు.

చైనాకు బయల్దేరిన మరో బృందం

చైనా పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మరో బృందం బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళ్లింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాల్‌, హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ కమిషనర్‌ శాలినీ మిశ్రా, హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ కమిషనర్‌ సోమేష్‌ కుమార్‌, మహబూబ్‌నగర్‌ శాసనసభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌లు ఈ బృందంలో ఉన్నారు.

పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఆస్తుల పెంపు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఈ నెల 11, 12 తేదీల్లో వాండా గ్రూపు నిర్వహించే అంతర్జాతీయ సమావేశంలో వీరు పాల్గొంటారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao today urged Klaus Schwab, the Executive Chairman of World Economic Forum, to hold the next WEF annual conference in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X