
పిల్లలకు చాక్లెట్లు పంచుతూ కేఏ పాల్ షాకింగ్ ప్రచారం.. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!!
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నా, కేఏ పాల్ కామెడీ మాత్రం అందరూ నవ్వుకునేలా చేస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడటంతో మునుగోడు ఉపఎన్నికను సీరియస్ గా తీసుకొని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే కేఏ పాల్ రోజుకో వేషం కట్టి ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మునుగోడులో హాస్యాన్ని పండిస్తున్నారు. తన ప్రచారంతో కేక పుట్టిస్తున్నారు.

మునుగోడులో పిల్లలతో కేఏ పాల్ డ్యాన్సులు.. ఎన్నికల ప్రచారం
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతోమునుగోడులో జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కే ఏ పాల్ మాత్రం తగ్గేదే లేదని, వార్ వన్ సైడే అని, తన గెలుపు ఖాయమైనదని చెప్పి రచ్చ చేస్తున్నారు.మునుగోడులో గెలిచేదినేనే అంటూ కే ఏ పాల్ తెగ ప్రచారం చేస్తున్నారు. పిల్లలను కూడా వదిలిపెట్టకుండా డ్యాన్సులు చేస్తూ, పిల్లలకు చాక్లెట్లు పంచుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కే ఏ పాల్ పిల్లలకు చాక్లెట్ లు పంచి చేస్తున్న ఎన్నికల ప్రచారం అందరినీ నవ్విస్తుంది.
వారేమైనా ఓటర్లా .. ఏందిది పాల్? నవ్వుకుంటున్న ఓటర్లు
వారేమైనా ఓటర్లా... ఏందిది పాల్ అని అంతా నవ్వుకునేలా చేస్తుంది. ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నకే ఏ పాల్ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకుంటే పర్వాలేదు కానీ చిన్న పిల్లల దగ్గరకు వెళ్లి సందడి చేస్తున్నాడు. వాళ్లకు చాక్లెట్ లు పంచుతూ, వాళ్ళతో కలిసి డ్యాన్సులు చేస్తున్నాడు.తానే కాబోయే సీఎం అంటూ, మునుగోడును అమెరికా చేస్తానంటూ ఆయన చేస్తున్న ప్రచారం అందరిలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.ఇక ఆయన తీరు చూసిన స్థానికులు మీరు సీఎం కాదు.., పీఎం కావాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు.

పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అంటూ పాల్ పై సెటైర్లు
మరికొందరు ఆయన ధోరణి చూసి పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాపం మునుగోడులో ఇంత కష్టపడుతున్న కేఏ పాల్ కు ఓటెయ్యండి అని మరికొందరు అడుగుతున్నారు. ఆయన తీరుపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు వేస్తున్నారు. కాబోయే సీఎం అని కొందరు, పీఎం అని కొందరు... మునుగోడులో సూపర్ ఫన్ ఇస్తున్న జోకర్ అని మరికొందరు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు పేలుస్తున్నారు.

ప్రజలు నవ్వుతున్నా తగ్గేదే లేదు.. కేఏ పాల్ నా? మజాకా?
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఏ మాత్రం తగ్గని కేఏ పాల్ డాన్స్ చేస్తూ స్టెప్పులేసి రచ్చ చేస్తున్నారు. ప్రజలు నవ్వుతున్నా పట్టించుకోకుండా ఆయన తనదైన ధోరణిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రోజుకో రకమైన వేష ధారణలతో చిత్రవిచిత్రంగా ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రజలకు చెబుతున్నారు.చెప్పులు కుడుతూ కనిపించిన కేఏ పాల్,ఆపై రైతు వేషధారణలో ప్రత్యక్షమయ్యారు.తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకొని, రైతులతో కలిసి కాసేపు ముచ్చటించారు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.ఇక రైతులు తనకే ఓటెయ్యాలని ప్రచారం చేశారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా చిన్న చిన్న పిల్లల దగ్గర ఎన్నికల ప్రచారం ఏంటి కేఏ పాల్ అంటూ మునుగోడు వాసులు ప్రశ్నిస్తున్నారు.