వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడు ఓటర్లను నవ్విస్తున్న కేఏ పాల్: సూపర్ పంచ్ లు.. పోలింగ్ కేంద్రాల్లోకి పరుగులు!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ అన్ని రాజకీయ పార్టీలలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి రాష్ట్రంలో పట్టు సాధించాలని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇక నేడు పోలింగ్ కొనసాగుతున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలలో మునుగోడు ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే మునుగోడు పోలింగ్ కు సంబంధించి ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ ఆసక్తికరంగా మారారు. పోలింగ్ రోజు కూడా ఆయన ఏ మాత్రం తగ్గకుండా తన విన్యాసాలు చూపిస్తున్నారు.

మునుగోడులో పట్టుబడుతున్న నగదు; ఓటర్లను ప్రలోభపెడుతున్న స్థానికేతరులు; పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలుమునుగోడులో పట్టుబడుతున్న నగదు; ఓటర్లను ప్రలోభపెడుతున్న స్థానికేతరులు; పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలు

అదిరిపోయేలా కేఏ పాల్ పంచ్

అదిరిపోయేలా కేఏ పాల్ పంచ్

మునుగోడు లో పోలింగ్ సరళిని పరిశీలించడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళిన కే ఏ పాల్ 10 వేళ్ళకు 10 ఉంగరాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇన్ డైరెక్టుగా కె ఏ పాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక కే ఏ పాల్ చేతికి ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ లలోకి రావడాన్ని గుర్తించిన రిపోర్టర్లు కొందరు మీది ఉంగరం గుర్తు.. మీ చేతికి పదివేళ్ళకు 10 ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ లోకి రావడం రూల్స్ బ్రేక్ చేసినట్టు కాదా? అని ప్రశ్నించారు. అందుకు కెఏ పాల్ రిపోర్టర్లకు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ గుర్తు కారు వాళ్ళు బయట కార్లలో తిరుగుతున్నారు. అది ఎన్నికల రూల్సు అతిక్రమించినట్టు కాదా? మరి వాళ్లు కార్లలో కాకుండా సైకిల్ మీద వస్తున్నారా? అంటూ ఎదురు ప్రశ్నించారు.

పోలింగ్ బూత్ ల సందర్శనలో కేఏ పాల్ పరుగులు .. నవ్వుకున్న ఓటర్లు

పోలింగ్ బూత్ ల సందర్శనలో కేఏ పాల్ పరుగులు .. నవ్వుకున్న ఓటర్లు


ఇక అనంతరం నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను అంటూ అన్ని పోలింగ్ బూత్ లను చూడాలి అని చెబుతూ పరుగు లంకించుకున్నాడు . ఇక పోలింగ్ బూత్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి, బూత్ లో నుంచి పరిగెత్తుకుంటూ కేఏపాల్ మళ్లీ బయటకు వచ్చాడు. దీంతో అక్కడ ఓటర్ల అందరూ ఒకసారి కే ఏ పాల్ తీరు చూసి షాక్ అయ్యారు. పోలింగ్ రోజు కూడా ఈ విన్యాసాలు ఏంటి పాల్ అంటూ నవ్వుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కేఏపాల్ పరుగులు పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. ఇక అంతే కాదు కె ఏ పాల్ సోషల్ మీడియా వేదికగా టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేశారు.

చిన్నారులతో పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ ప్రచారం. మండిపడ్డ కేఏ పాల్, ఆయన కోడలు

చిన్నారులతో పోలింగ్ కేంద్రాల వద్ద టీఆర్ఎస్ ప్రచారం. మండిపడ్డ కేఏ పాల్, ఆయన కోడలు


టిఆర్ఎస్ పార్టీ పోలింగ్ కేంద్రాల బయట మహిళలు, చిన్నారులతో ప్రచారం చేయిస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంపై కేఏ పాల్ కోడలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 ఏళ్ల కంటే చిన్న వయసున్న మైనర్ లతో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయించడాన్ని ఆమె తప్పు పట్టారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ పై మాట్లాడిన కే ఏ పాల్ అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పై తనదైన శైలిలో మండిపడ్డారు. ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభ పెడుతూ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు.

డబ్బులు పంచిన వారిని డిస్ క్వాలిఫై చెయ్యరా? కేఏ పాల్ ప్రశ్న

డబ్బులు పంచిన వారిని డిస్ క్వాలిఫై చెయ్యరా? కేఏ పాల్ ప్రశ్న


బిజెపి ముప్పై వేలు ఇస్తానని చెప్పి 3,000 ఇచ్చిందని, టిఆర్ఎస్ పార్టీ తులం బంగారం, 30000 ఇస్తామని చెప్పి 3000 ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ 1500 ఇచ్చిందని ఓటర్లు చెబుతున్నా ఆ మూడు పార్టీలకు చెందిన వాళ్లను పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో కోట్ల డబ్బులు దొరికినా, అవి ఫలానా పార్టీకి చెందిన నాయకులవి అని తెలిసినా వారిని ఎందుకు డిస్ క్వాలిఫై చేయలేదని కేఏ పాల్ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్న కే ఏ పాల్ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

English summary
KA Paul went to inspect the polling centers in Munugode, ran into the polling centers. They ran out of the centers with the same speed. KA Paul, visited polling stations with 10 rings on 10 fingers, gave a super punch to the reporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X