Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాష్ట్రపతి పోటీపై కేఏ పాల్ క్లారిటీ -ఎన్డీయేకు తటస్ధ అభ్యర్ధిసూచన- కేసీఆర్ తో మరో అభ్యర్ధిపై చర్చ

త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే అధికార ఎన్డీయే తాము నిలబెట్టే అభ్యర్ధిని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అదే సమయంలో విపక్షాలు ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రోరల్ కాలేజీలో దాదాపు సగం మెజారిటీ కలిగిన ఎన్డీయే తమ అభ్యర్ధిని సులువుగా గెలిపించుకునే అవకాశం ఉంది. అయితే అభ్యర్ధి ఎవరూ ఇప్పటివరకూ తేలకపోవడంతో కేఏ పాల్ కు కూడా అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపై కేఏ పాల్

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపై కేఏ పాల్

త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, దేశవిదేశాల్లో అందరితో సత్సంబంధాలు కలిగిన కేఏ పాల్ పోటీ చేయబోతున్నారనే చర్చ సాగుతోంది. దీనిపై ఆయన ఇవాళ స్పందించారు. దీంతో పాటురాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలపై పాల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

దీంతో పాల్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే తాను మాత్రం రాష్ట్రపతి ఎన్నికల బరిలో లేనని కేఏ పాల్ క్లారిటీ ఇచ్చేశారు.

ఎన్డీయేకు తటస్ధ అభ్యర్ధి సూచన

ఎన్డీయేకు తటస్ధ అభ్యర్ధి సూచన

రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించిన కేఏ పాల్.. ఎన్డీయే అభ్యర్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేకు తటస్ధ అభ్యర్ధిని నిలబెట్టమని తాను సూచించినట్లు కేఏ పాల్ ప్రకటించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో అదే మంచిదన్నారు. ఎలాగో బీజేపీ నిలబెట్టే అభ్యర్ధి 60 శాతం ఓట్లతో గెలుస్తాడని, అందుకే తటస్ధ అభ్యర్ధి అయితే మంచిదని తాను కేంద్రానికి సూచించినట్లు కేఏ పాల్ వెల్లడించారు. ప్రస్తుతం ప్రతిపక్షాల్లో ఐక్యత లేదన్నారు.

Recommended Video

    Megastar Chiranjeevi Acting School Admissions open *Entertainment | Telugu OneIndia
    విపక్షాలకు పాల్ సూచన

    విపక్షాలకు పాల్ సూచన

    అలాగే రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు స్పందిస్తున్న తీరుపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోయే అభ్యర్ధి పక్షాన ఉండబోనన్న పాల్.. విపక్షాల్లో రాష్ట్రపతి అభ్యర్ధిపై ఏకాభిప్రాయం లేదన్నారు. అందుకే విపక్షాలు ప్రతిపాదించిన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉండటానికి ఇష్టపడటం లేదన్నారు. ఇప్పటికైనా విపక్షాలు ఐక్యంగా ముందుకు కదలాలని కేఏ పాల్ సూచించారు. విపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బీజేపీ బలంగా కనిపిస్తోందని పాల్ విశ్లేషించారు.

     కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుండరన్న పాల్

    కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుండరన్న పాల్

    రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందనపైనా కేఏ పాల్ మాట్లాడారు. తనతో పాటు మరో 18 పార్టీలు సేవ్ సెక్యులర్ కూటమిలో ఉన్నాయన్నారు. అలాగే సేవ్ సెక్యులర్ కూటమి తరఫున కేసీఆర్ తో రాష్ట్రపతి ఎన్నికల్లో సొంత అభ్యర్ధిని నిలబెట్టే విషయంలో చర్చించినట్లు పాల్ తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలపై రాజకీయ పార్టీలు నాలుగు కూటములుగా ఉన్నాయన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఆర్టీ టీఎఆర్ఎస్ తరఫున ఎంపీలు ఉండబోరని పాల్ జోస్యం చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+