Munugoduలో కోమటిరెడ్డి రాజగోపాల్‌కు కేఏ పాల్ షాక్.. మామూలుగా లేదుగా..!!

మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మునుగోడు ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం రాజకీయ పార్టీలు నేతలు ప్రయత్నాలు చేస్తుంటే, ఏకంగా ఇతర పార్టీల అభ్యర్థులనే తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు మరికొందరు. మొత్తంగా మునుగోడు రాజకీయం ఎన్నికల బరిలో ఉన్న పార్టీ నేతల తీరుతో, అభ్యర్థుల ప్రచార సరళితో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కేఏ పాల్ ఆసక్తికర సంభాషణ

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కేఏ పాల్ ఆసక్తికర సంభాషణ

తాజాగా మునుగోడు ఉప ఎన్నికలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల బరిలో తాను సైతం అంటూ రంగంలోకి దిగిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరఫున, ఇండిపెండెంట్ గానూ నామినేషన్ దాఖలు చేశారు, ప్రజాశాంతి పార్టీ తరఫున కె ఏ పాల్ దాఖలుచేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది.

దీంతో కె ఏ పాల్ ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన నామినేషన్ తిరస్కరణ పై ఎన్నికల అధికారులతో మాట్లాడడానికి చండూరు కి వచ్చిన ఆయన అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఆసక్తికర సంభాషణ చేశారు.

మునుగోడులో తనకు మద్దతు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోరిన కేఏ పాల్

మునుగోడులో తనకు మద్దతు ఇవ్వాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కోరిన కేఏ పాల్

బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, అక్కడికి వెళ్ళిన కే ఏ పాల్ ఆయనను ఆలింగనం చేసుకుని మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి గారు.. మునుగోడు ఉప ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వండి. 60 నెలల్లో ఎవరు చేయలేని అభివృద్ధిని ఆరు నెలల్లో చేసి చూపిస్తానంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ రాజగోపాల్ రెడ్డిని అభ్యర్థించారు. ఇక అంతే కాదు బీజేపీ శ్రేణులతో కలిసి కేఏపాల్ కొంతదూరం నడిచారు. కే ఏ పాల్ ను చూడగానే బిజెపి నాయకులు జై బిజెపి అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు.

తనకు అవకాశం ఇస్తే మునుగోడును రోల్ మోడల్ చేస్తా

తనకు అవకాశం ఇస్తే మునుగోడును రోల్ మోడల్ చేస్తా

ఇక అక్కడ ఎన్నికల అధికారిని కలవడానికి కె.ఎ.పాల్ ప్రయత్నించినప్పటికీ, ఆదివారం సెలవుదినం కావడంతో అధికారులు ఎవరూ లేరు. దీంతో కె ఏ పాల్ విలేకరులతో మాట్లాడిన అనంతరం అక్కడినుండి వెనుదిరిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేఏ పాల్ తనకు మద్దతు ఇవ్వాలని తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ని కోరారని పేర్కొన్నారు. తనకు అవకాశం ఇస్తే, తనను మునుగోడు పార్టీ ప్రజలు గెలిపిస్తే మునుగోడును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని కె ఏ పాల్ వెల్లడించారు.

 మునుగోడులో అవకాశమిస్తే మరో అమెరికా చేస్తా

మునుగోడులో అవకాశమిస్తే మరో అమెరికా చేస్తా

మునుగోడులో టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ల ఓట్లను కొనుగోలు చేస్తున్నాయని కే ఏ పాల్ విమర్శించారు. మునుగోడులో కులగజ్జి, కుట్రలు, కుతంత్రాలు పోవాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కె.ఎ.పాల్ విజ్ఞప్తి చేశారు. తమకు అవకాశం కల్పిస్తే ఆరునెలల్లో ఏడు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు అడవిలా ఉన్న హైదరాబాద్ ను తానే అభివృద్ది చేశానని పేర్కొన్న కే ఏ పాల్, మునుగోడులో అవకాశమిస్తే మునుగోడును మరో అమెరికా చేస్తానని కె ఏ పాల్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+