అనాథ పిల్లల బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే: డిప్యూటీ సీఎం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వాదేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. గురువారం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశమని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.

మరో మంత్రి చందూలాల్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చుతున్నారని అన్నారు. అందరికి నాణ్యమైన విద్యను అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎంపీ సీతారామ్ నాయక్ అన్నారు.
భోజనం వికటించి విద్యార్ధులు అస్వస్ధత
నల్గొండ జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications