కాళేశ్వరం: అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ.80వేల కోట్ల అంచనా
హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుతో తెలంగాణలో నీటి సమస్య తీరనుంది. ఇది అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు కావడం గమనార్హం. దీనికి రూ.80,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి కడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టు ఇదే.
లక్షల ఎకరాల్లో ఉండే ఈ ప్రాజెక్టు పలు జిల్లాలను ఆనుకొని ఉంటుంది. రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరనుంది. ఈ ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కడుతున్నారు.

ఈ ప్రాజెక్టు ఆయకట్టు 45,000 ఎకరాలు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది.
గోదావరి నది నుంచి తొంబై రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం ఈ పథకం ఉద్దేశం. వందల కి.మీ. దూరం కాలువలు, సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద లిఫ్టులు, ఆసియాలోనే అతి పెద్ద సర్జ్‌పూల్ ఏర్పాటు, భూగర్భంలోనే పంప్‌హౌస్‌లు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.
ప్రాజెక్ట నిర్మాణ వ్యయం రూ.80వేల కోట్లు. మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. సొరంగాల పొడవు 203 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు కోసం 80వేల ఎకరాల భూమిని సేకరించారు. అటవి భూమి 3050 ఏకరాలు. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 2 టీఎంసీఎఫ్‌టీ నీటిని, అవసరమైతే 3 టీఎంసీఎఫ్‌టీ నీటిని మోటార్లు, పంప్ హౌస్‌ల ద్వారా మళ్లించనున్నారు.












Click it and Unblock the Notifications