లిక్కర్ స్కాంలో అప్రూవర్ గా మారనున్న కవిత?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత అప్రూవర్ గా మారాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఎటువంటి తప్పు చేయలేదని, అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదని కవిత గతంలోనే తేల్చిచెప్పారు. అయితే అకస్మాత్తుగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను నిందితురాలిని కాదని, కేవలం బాధితురాలిని మాత్రమేనని ఈడీ జడ్జికి లేఖ రాశారు. దీని ఆధారంగానే ఆమె అప్రూవర్ గా మారనున్నారా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే కవిత ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంవత్సరం నుంచి జైలులోనే ఉన్నారు. తన భార్య క్యాన్సర్ పేషెంట్ అని విన్నవించినప్పటికీ బెయిల్ నిరాకరణకు గురైంది. అయితే అదే సమయంలో బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న మరో నిందితుడు శరత్ చంద్రారెడ్డికి మాత్రం వెంటనే బెయిల్ మంజూరవడం విశేషం. ఈ కేసులో అప్రూవర్లుగా మారినవారంతా బెయిల్ పై బయటకు వచ్చారు.

ఈ నేపథ్యంలోనే కవిత కూడా తాను అప్రూవర్ గా మారేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని తన న్యాయవాదులకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నిర్ణయం ఆమె రాజకీయ భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ అదుపులోకి తీసుకొని ఈ రోజు కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి ఆమేనని ఆరోపించింది. సాధారణంగా మనీ లాండరింగ్ కేసుల్లో అంత సులువుగా బెయిల్ రాదు. అప్రూవర్లుగా మారినవారందరికీ ఈ కేసులో బెయిల్ లభించింది. కొడుకు పరీక్షల కోసం బెయిల్ కావాలని కోరగా తిరస్కరించారు. దీంతో అప్రూవర్ గా మారితేనే బయటకు రావడానికి వీలుపడుతుందని అర్థం కావడంతో కవిత ఈ నిర్ణయం తీసుకొనివుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications