Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కవిత ఎఫెక్ట్: కల్తీ ఆహారంపై రంగంలోకి ప్రత్యేక బృందం!

మీరు తినే పన్నీర్ నకిలీది కావచ్చు.. మీరు ఆర్డర్ చేసే చికెన్ కుళ్లిపోయినది కావచ్చు.. చివరికి మీ రోజువారీ టీ పొడి, అల్లం వెల్లుల్లి పేస్టులో కూడా కల్తీ రసాయనాలు ఉండొచ్చు. తెలంగాణలో గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న ఆహార కల్తీ వ్యవహారాలు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇంకా హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కల్తీ మాఫియా గుట్టు రట్టు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు " H-FAST" (Hyderabad Food Adulteration Surveillance Team) పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు.

నగరంలో కలకలం రేపుతున్న కల్తీ దందా
గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖైరతాబాద్‌లో దాదాపు 3000 కిలోల కల్తీ పన్నీర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్సీగుట్టలో అనారోగ్యకరమైన వాతావరణంలో నిల్వ ఉంచిన 800 కిలోల పాడైపోయిన చికెన్‌ను పట్టుకున్నారు. బోరబండతో పాటు లాలాపేటలో కూడా నాణ్యత లేని వస్తువులు, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలతో తయారు చేస్తున్న సుమారు 1900 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేశారు. సనత్ నగర్‌లో టీ పొడిలో డస్ట్, కోకో పీట్, కృత్రిమ రంగులను కలిపి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు.

Kalvakuntla Kavitha Effect Hyderabad Police Launch H-FAST Team to Crack Down on Food Adulteration Mafia

అసలు ఈ 'H-FAST' అంటే ఏమిటి?
నగరవాసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హైదరాబాద్ పోలీసులు ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లతో కూడిన 28 మంది సభ్యులు ఉంటారు. ఈ టీమ్ నిరంతరం నగరంలోని ఆహార తయారీ కేంద్రాలను పర్యవేక్షిస్తుంది, దాడులు నిర్వహిస్తుంది. కల్తీకి పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈ బృందం ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తుంది.

కవిత పోరాటంతో రంగంలోకి ప్రత్యేక బృందం
తెలంగాణలోని హోటళ్లు, రెస్టారెంట్లు, తయారీ కేంద్రాల్లో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గడిచిన కొన్ని నెలలుగా గట్టిగా గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం లెక్కల్లో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆమె ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు విమర్శలు వెల్లువ మధ్య ప్రభుత్వం దిగొచ్చింది. కల్తీ ఆహారాన్ని అరిగట్టడానికి H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందాన్ని రంగంలోకి దించింది.

కవిత పోరాటం: మౌనాన్ని వీడిన సర్కార్
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు 46 శాతం పడిపోవడం, ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాకపోవడంపై కవిత తీవ్రంగా ధ్వజమెత్తారు. సోషల్ మీడియా వేదికగా "ప్రజల ఆరోగ్యం కంటే ప్రభుత్వానికి కల్తీ మాఫియా ప్రయోజనాలే ముఖ్యమా?" అని ఆమె సంధించిన ప్రశ్నలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. పాలు, పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్టు వంటి నిత్యావసరాల్లో కల్తీ జరుగుతున్నా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. ఈ ఒత్తిడి ఫలితంగానే పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో పనిచేసేలా కొత్త వ్యూహాన్ని రచించారు.

రంగంలోకి H-FAST
కవిత లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, హైదరాబాద్ పోలీసులు 28 మంది సభ్యులతో కూడిన ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.కవిత పోరాటంతో మేల్కొన్న యంత్రాంగం.. ఖైరతాబాద్, బోరబండ, సనత్ నగర్ వంటి ప్రాంతాల్లో దాడులు చేసి వేల కిలోల కల్తీ పన్నీర్, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్ చేసింది. కేవలం కిరాణా షాపులే కాకుండా, బడా రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులపై కూడా H-FAST బృందం నిఘా పెంచింది. తెలంగాణ ప్రజల ఆరోగ్య హక్కు కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న ఈ పోరాటం ఓ సామాజిక బాధ్యతగా మారింది. H-FAST టీమ్ దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని, కల్తీ రహిత తెలంగాణ సిద్ధించే వరకు తన పోరాటం ఆపబోనని ఆమె సంకేతాలిచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా గణాంకాల్లో కాకుండా, క్షేత్రస్థాయిలో మార్పు చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+