వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మాజీ మంత్రి కొంప ముంచిన కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రగడ!!

|
Google Oneindia TeluguNews

కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన మాజీ మంత్రి, కీలక నేత కొంపముంచింది. వచ్చే ఎన్నికలలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తారా లేదా? అన్నది ప్రస్తుతం తాజా పరిణామాలతో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.

కామారెడ్డి రైతుల పోరాటంలో వెనుకబడిన కాంగ్రెస్

కామారెడ్డి రైతుల పోరాటంలో వెనుకబడిన కాంగ్రెస్


కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు, కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకోవడంతో రైతులు సాగిస్తున్న నిరసనల పర్వం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో కామారెడ్డి రైతుల పక్షాన నిలిచి కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణ ప్రభుత్వం పై పోరాటం మొదలుపెట్టాయి. అయితే కామారెడ్డి రైతుల పక్షాన నిలిచి పోరాటం చేయడంలో బిజెపి కి వచ్చినంత మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు.

బీజేపీకి విపరీతమైన మైలేజ్

బీజేపీకి విపరీతమైన మైలేజ్


షబ్బీర్ అలీ ఎంత ప్రయత్నం చేసిన రైతులు షబ్బీర్ అలీ చేసిన పోరాటాన్ని పెద్దగా గుర్తించలేకపోయారు. ఇక ఇదే సమయంలో బిజెపి తరఫున, తమ పక్షాన నిలిచి పోరాటం చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఈ విషయంలో విపరీతమైన మైలేజ్ వచ్చింది. రైతుల పక్షాన పోరాటం చేస్తుంది బిజెపి అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల పోరాటాన్ని భుజాన వేసుకుని పోరాటం సాగించిన బిజెపి దీనిని క్యాప్చర్ చేయడంలో సక్సెస్ అయింది.

బీజేపీ వెంకటరమణారెడ్డికి టికెట్ కు లైన్ క్లియర్

బీజేపీ వెంకటరమణారెడ్డికి టికెట్ కు లైన్ క్లియర్

వచ్చే ఎన్నికలలో కామారెడ్డిలో టికెట్ ఆశిస్తున్న వెంకటరమణారెడ్డికి కూడా కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యవహారంతో టికెట్ కు లైన్ క్లియర్ అయిందని టాక్ వినిపిస్తుంది. రైతుల భూముల వ్యవహారాన్ని తమ సొంత అజెండాగా చేసుకుని పెద్ద ఎత్తున బిజెపి సాగించిన పోరాటంలో బిజెపికి విపరీతమైన మైలేజ్ వచ్చింది. ఒకపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డికి వెళ్లి రైతుల కోసం కలెక్టరేట్ ముందు ఆందోళన బాట పట్టడం, బిజెపి నాయకులపై కేసులు నమోదు కావడం వంటి అంశాలు కూడా ఈ వ్యవహారంలో బిజెపి, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టివేయడంలో కీలకంగా మారింది.

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి తలనొప్పిగా మాస్టర్ ప్లాన్ వ్యవహారం

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి తలనొప్పిగా మాస్టర్ ప్లాన్ వ్యవహారం


ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డికి వెళ్తానని చెప్పి, కామారెడ్డికి వెళ్ళలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీ విషయంలో రేవంత్ రెడ్డి కూడా పాజిటివ్ గా లేడు అనే టాక్ వినిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి బాగా మైనస్ అయ్యాయి. కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ వ్యవహారం షబ్బీర్ అలీని రాజకీయంగా చిక్కుల్లోకి నెట్టింది. బిజెపి కి వచ్చిన మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి టికెట్ ఆశిస్తున్న షబ్బీర్ అలీ కి ఈ పరిణామాలు కొంత నిరాశ జనకంగా కనిపించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కామారెడ్డి లో తాజా పరిణామాలు టిఆర్ఎస్ కు తలనొప్పి కాగా, కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చి, బిజెపికి అనుకూలంగా మారాయి అన్న చర్చ జరుగుతుంది.

English summary
The Kamareddy Municipal Master Plan controversy created head ache to former Congress Minister Shabbir Ali. BJP got mileage with this affair and Congress lagged behind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X