వైశ్యులపై యుద్ధమే, అంబేడ్కర్ తర్వాత అందుకోసం నేనే పుట్టాను: ఐలయ్య, టిఆర్ఎస్‌పై సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం రాసిన వివాదాస్పద రచయిత కంచ ఐలయ్య ఆదివారం మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో 46 శాతం ఆస్తులు కోమటోళ్ల చేతిలో ఉన్నాయని తన ఆక్రోషాన్ని వెళ్లగక్కారు.

వైశ్యులు బిజెపి, టిఆర్ఎస్‌లకు ఇచ్చే డొనేషన్లలో 5 శాతం ఇస్తే రైతు ఆత్మహత్యలు జరగవన్నారు. సరిహద్దుల్లో చనిపోతున్న సైనికులు ఆదివాసులు, గిరిజనులేనన, అలాంటి వాళ్ల కుటుంబంలో ఒక్కరికి మీ మీ కంపెనీల్లో ఉద్యోగం ఇవ్వాలన్నారు.

విదేశీ ఏజెంట్‌గా మారిన కంచ ఐలయ్య, సామాజిక ఉగ్రవాదిలా: టిఆర్ఎస్ ఆగ్రహం

ఇవాళ్టి నుంచి ఉద్యోగం వదిలేస్తున్నానని, తొలిసారి జెండా కప్పుకుంటున్నాని, టి మాస్ ఫోరానికి కార్యకర్తగా పని చేస్తానని చెప్పారు. ఏపీలో కూడా తిరుగుతానని వెల్లడించారు.

Kancha Ialaiah controversial comments on TRS leaders in warangal meeting

తనపై విమర్శలు చేస్తున్న తెరాస నేతలకు కోమటోళ్లు డబ్బులిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్లకు వైశ్యుల నుంచి డబ్బులు కావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఆయన వరంగల్ టిమాస్ సభలో పాల్గొన్నారు.

ఇక ఆర్యవైశ్యులపై యుద్ధమే అన్నారు. తనను చంపితే ఆర్యవైశ్యులదే బాధ్యత అన్నారు. అంబేడ్కర్ తర్వాత కులాలను ఉద్ధరించడానికి పుట్టింది తానేనని, టి-మాస్ ఫోరానికి పూర్తిస్థాయి కార్యకర్తను అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Writer Kancha Ialaiah controversial comments on Telangana Rastra Samithi leaders Srinivas Goud, Balka Suman in warangal meeting.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి