వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిండిపై ఆంక్షలేమిటి, అమీర్ ఖాన్‌పై అలాగేనా: కంచ ఐలయ్య ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంసాహారాన్ని నిషేధించారని, ఈ రాష్ట్ర్లాల్లో తినే తిండి మీద ఆంక్షలు విధిస్తున్నా రని, ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలో భాగంగానే అమలు జరుగుతోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులు ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య అన్నారు. నాలుగు వందల ఏళ్లు పరిపాలించిన ముస్లిం రాజులు ఎక్కడా పంది మాంసా న్ని నిషేధించిన చరిత్ర లేదని చెప్పారు.

ఏడాది క్రితం అధికారంలోకొచ్చిన బీజేపీ మాత్రం దళిత, బహుజనులు, మైనార్టీలు తినే ఆవు మాంసాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ‘హోలీ కవ్‌-పాలిటిక్స్‌' అనే అంశంపై డెమోక్రటిక్‌ కల్చరల్‌ ఫోరం ఆధ్వర్యంలో ఓయూలో బుధవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

1994లో మొదటి సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం బీఫ్‌ గురించి చర్చ చేస్తే, తిండి విషయంలో బీజేపీ వైఖరి ఇదే అయితే, ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా భారత దేశం నుంచి వేరుపడాల్సి వస్తుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని నాటి పార్లమెంటు సభ్యుడు పీఏ సంగ్మా చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా ఐలయ్య గుర్తుచేశారు.

Kancha Ilaiah opposes restriction on food

పంది, చేప వంటి జంతువులవంటివాటిని హిందూమతంలో దేవుళ్లుగా ఆరాధిస్తుంటే కేవలం ఆవు మాత్రమే పవిత్రమైందని చెప్పడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర దాగి ఉందన్నారు. దేవుడి అవతారాల్లో ఒకటైన పంది ఎందుకు పవిత్రం కాదో చెప్పాల్సిన బాధ్యత ఈ శక్తుల మీద ఉందన్నారు. జంతువుల రక్షణ గురించి రాజ్యాంగంలో పొందుపర్చిన విధానం ఏ దేశంలోనూ లేదన్నారు.

ఒక సమావేశంలో బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖాన్‌ తన భార్య కిరణ్‌రావు దేశంలో ఉండేందుకు భయపడుతుందనే విషయాన్ని చెప్తే ఆయన్ని దేశం నుంచి వెళ్లిపోండని చెబుతూ పరోక్షంగా భయాన్ని రేకెత్తించే విధంగా సోషల్‌ మీడియాలో, టీవీ చానళ్లల్లో చర్చలు చేయడాన్ని చూస్తే దేశం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నాకుయ

రీసెర్చ్‌ సెంటర్లన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులతో నిండిపోయాయని, ఇవన్నీ తప్పుడు నివేదికలు ఇస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని జాతీయ పోషకాహార సంస్థ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ వీణా శత్రఘ్న అన్నారు. ఆరోగ్యం కోసం ఆసుపత్రుల్లో ఇచ్చే బీ-12 లాంటి మందులు, ట్యాబ్లెట్లు మాంసాహారాల నుంచి తీసుకుంటు న్నారంటే దాంట్లో ఎంత పోషక విలువలు ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు.

ఎక్కువ డబ్బులు వెచ్చించి శాఖాహారాన్ని తీసుకోవడం కంటే తక్కువ డబ్బులతో వచ్చే బీఫ్‌ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని డాక్టర్‌ సౌమ్య దెచ్చమ్మ అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు డేవిడ్‌, స్టాలిన్‌, కోట శ్రీని వాస్‌గౌడ్‌, ముసావీర్‌, ఆరుణాంక్‌, కృష్ణ, లింగస్వామి, శరత్‌, అలెగ్జాండర్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

English summary
dalith intellectual and ex professor of Osmania University Kancha Ilaiaah opposed ban on non vegetarian foods
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X