వారిద్దరు కలిశారు: ''సుఖేందర్‌రెడ్డే నా గురువు, కానీ, కోమటిరెడ్డిపై వ్యతిరేకతతోనే చేరలేదు''

Posted By:
Subscribe to Oneindia Telugu

నల్లగొండ: టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్‌లో చేరేందుకు కంచర్ల భూపాల్‌రెడ్డి రంగం సిద్దం చేసుకొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరులు కలిశారు. కాంగ్రెస్ ‌పార్టీలో చేరితే టిక్కెట్టుపై హమీ లేని కారణంగా కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరులు టిఆర్ఎస్‌ను ఎంచుకొన్నారు. అయితే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీ దుబ్బాక నర్సింహ్మరెడ్డిని కంచర్ల భూపాల్‌రెడ్డి కలిశారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని దుబ్బాక నర్సింహ్మరెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డిలు ప్రకటించారు.

రేవంత్‌కు ట్విస్ట్ ఇచ్చిన కంచర్ల: కోమటిరెడ్డే కారణమా, కారెక్కుతారా?

రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించారు. అయితే నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు భూపాల్‌రెడ్డికి కేటాయించే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి హమీ లేదు.

రేవంత్ ఎపిసోడ్: టిటిడిపి నేతలతో రేపు బాబు మీటింగ్, సండ్రకు ఎల్పీనేతగా ఛాన్స్

1999 నుండి ఈ అసెంబ్లీ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధిస్తున్నారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాదని కంచర్ల భూపాల్‌రెడ్డికి నల్లగొండ అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్టును కేటాయించే విషయమై రేవంత్‌రెడ్డి నుండి హమీ రాకపోవడంతో కంచర్ల భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌ను ఎంచుకొన్నారు.

దుబ్బాకతో భేటీ అయిన కంచర్ల భూపాల్‌రెడ్డి

దుబ్బాకతో భేటీ అయిన కంచర్ల భూపాల్‌రెడ్డి

టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కంచర్ల భూపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నామని టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దుబ్బాక నర్సింహారెడ్డి తెలిపారు. నల్లగొండలో దుబ్బాక నివాసంలో కంచర్ల భూపాల్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్‌ను బలోపేతం చేస్తామని వారిద్దరు ప్రకటించారు.

కోమటిరెడ్డిపై వ్యతిరేకతతో టిడిపిని వీడలేదు

కోమటిరెడ్డిపై వ్యతిరేకతతో టిడిపిని వీడలేదు

తనను పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డికి పాదాభివందనం చేస్తున్నానని కంచర్ల అన్నారు. నర్సన్న ఆధ్వర్యంలో నల్లగొండలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. గతంలోనే తాను ఎంపీ గుత్తాతో పాటు ఆనాడే పార్టీ మారాల్సి ఉండేనని ఆయన గుర్తుచేసుకొన్నారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కారణంగా సుఖేందర్‌రెడ్డి వెంటరాలేకపోయానని కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు.

 సుఖేందర్‌రెడ్డితో 27 ఏళ్ళ అనుబంధం

సుఖేందర్‌రెడ్డితో 27 ఏళ్ళ అనుబంధం

నల్గొండఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో తనకు 27 ఏళ్ల అనుబంధం ఉందని కంచర్ల భూపాల్‌రెడ్డి చెప్పారు. తాను కూడ సుఖేందర్ ‌రెడ్డి శిష్యుడినేనని ఆయన గుర్తుచేసుకొన్నారు.ఒకప్పుడు కోమటిరెడ్డి, దుబ్బాక ఇద్దరు ప్రాణమిత్రులేనని.. కోమటిరెడ్డిని తనుకు పరిచయం చేసిన వ్యక్తి కూడా దుబ్బాక నర్సింహ్మరెడ్డేనని కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రస్తావించారు.

కంచర్ల వెంట టిడిపి ప్రజాప్రతినిధులు

కంచర్ల వెంట టిడిపి ప్రజాప్రతినిధులు

కంచర్ల భూపాల్‌రెడ్డి వెంట టిడిపికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడ టిఆర్ఎస్‌లో చేరనున్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పలువురు ప్రజాప్రతినిధులు కంచర్ల భూపాల్‌రెడ్డి వెంట టిఆర్ఎస్‌లో చేరనున్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి టిఆర్ఎస్‌ జెండాను ఎగురవేసేందుకు అన్ని రకాల వ్యూహలను రచిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
We work together said Kancharla Bhupal Reddy, Dubbaka Narasimha Reddy on Sunday at Nalgonda.Kancharla Bhupal reddy will join in TRS with followers on NOV 6.
Please Wait while comments are loading...