కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీకి భారీ షాక్: టీఆర్ఎస్‌లోకి జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Assembly Elections 2018 : టీఆర్ఎస్ లో చేరిన కొత్త శ్రీనివాస్ రెడ్డి | Oneindia Telugu

కరీంనగర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ భారీ షాక్ తగిలింది. తనకు హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించినా.. రాకపోవడంతో అసంతృప్తికి గురైన కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.

బీజేపీకి రాజీనామా

బీజేపీకి రాజీనామా

ఈ మేరకు మంగళవారమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌కు శ్రీనివాస్ రెడ్డి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఐదు రోజుల కిందట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరివి వేణుగోపాల్ రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే.

బీజేపీకి భారీ దెబ్బ

బీజేపీకి భారీ దెబ్బ

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి రాజీనమా చేయడంో ఆ పార్టీకి జిల్లాలో భారీ దెబ్బగానే చెప్పవచ్చు. కాగా, బీజేపీకి రాజీనామా చేసిన శ్రీనివాస్ రెడ్డితో సంప్రదింపులు జరిపిన కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడించినట్లు సమాచారం.

కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లోకి కొత్త

కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లోకి కొత్త

ఈ నేపథ్యంలో బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో కొత్త శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ పాలన, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుడినై పార్టీలు చేరుతున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

అందుకే రాజీనామా చేశా..

అందుకే రాజీనామా చేశా..

బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనపై కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తోందని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నప్పటికీ సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని వాపోయారు. ఇటీవల వెల్లడించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారని.. హుస్నాబాద్ టికెట్ తనకు ఇవ్వాలంటూ కార్యకర్తలు కోరినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధిష్టానం పట్టించుకోలేదని మండిపడ్డారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

English summary
The first list of BJP candidates announced a few days ago has triggered heartburn among some leaders in the districts. In Karimnagar, BJP district president Kotha Srinivas Reddy resigned from the party primary membership on Tuesday alleging his services were not being recognised. Srinivas Reddy wanted the party ticket from Husnabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X