Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమ్రపాలి బాటలో కలెక్టర్ సర్ఫరాజ్: గుట్టలను చుట్టేశారు(పిక్చర్స్)

పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ యువ కలెక్టర్లు అడవుల బాట పడుతున్నారు. గత మూడు రోజుల క్రితం కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ జిల్లాలోని అడవుల్లో పర్యటించి ట్రెక్కింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే

కరీంనగర్: పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో యువ కలెక్టర్లు అడవుల బాట పడుతున్నారు. గత మూడు రోజుల క్రితం కలెక్టర్ ఆమ్రపాలి వరంగల్ జిల్లాలోని అడవుల్లో పర్యటించి ట్రెక్కింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆమె బాటలోనే మరో కలెక్టర్ కూడా నడిచారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదివారం అడవుల బాట పట్టారు.

ఆమ్రపాలి ట్రెక్కింగ్..

ఆమ్రపాలి ట్రెక్కింగ్..

ఆమ్రపాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంట మండలంలోని పాండవుల గుట్టలను ఎక్కేశారు(రాక్ క్లైంబింగ్). గత మూడ్రోజుల క్రితం కూడా వరంగల్‌కి 20కి.మీల దూరంలోని అడవుల్లో ట్రెక్కింగ్ నిర్వహించారు.

రాయికల్ గుట్టలపై సర్ఫరాజ్.

రాయికల్ గుట్టలపై సర్ఫరాజ్.

కాగా, ఆదివారం కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ రాయకల్ గుట్టపై ట్రెక్కింగ్ చేశారు. జిల్లాలోని సైదాపూర్ మండలంలో ప్రకృతి అందాల నడుమ కొలువైన ప్రాంతం రాయకల్ గుట్ట. గుట్ట ప్రాంతం ఎప్పుడు జలపాతంతో కళకళలాడుతుంది. వరుసగా కురుస్తున్న వర్షాలులతో రాయకల్ గుట్టకు కొత్త అందాలు తెచ్చాయి.

ఆకర్షిస్తున్న జలపాతాలు..

ఆకర్షిస్తున్న జలపాతాలు..

గుట్టపై జాలువారుతున్న జలపాతాలు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడు పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండే కలెక్టర్ సర్ఫరాజ్, కరీంనగర్ సీపీ కమల్‌హాసన్ రెడ్డితో కలిసి గుట్టను సందర్శించారు.

పర్యాటక అభివృద్ధి..

పర్యాటక అభివృద్ధి..

కొద్ది గంటలపాటు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరారు కలెక్టర్ సర్ఫరాజ్, సీపీ కమల్ హాసన్. కాగా, ఉన్నతాధికారులు వస్తున్నారని తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాయకల్ గట్టకు బారులుతీరారు. ఇలాంటి అందమైన ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+