
తెరపైకి మళ్లీ ఆ 'ప్రతిజ్ఞ' వివాదం... మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు...
మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదుకు కరీంనగర్ మున్సిఫ్ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది మార్చిలో భీమ్ దీక్షా కార్యక్రమంలో భాగంగా చేసిన ప్రతిజ్ఞ ద్వారా హిందూ దేవీ,దేవతలను ప్రవీణ్ కుమార్ కించపరిచారన్న ఫిర్యాదు మేరకు న్యాయమూర్తి సాయి సుధ ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రవీణ్ కుమార్ పదవీ విరమణ చేసిన రెండు రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
వివాదం:
ఐపీఎస్
ప్రవీణ్‌పై
చర్యలకు
బీజేపీ
విష్ణు
వర్దన్
డిమాండ్...
స్వేరోస్
చీఫ్
రియాక్షన్
ఇదీ...
కరీంనగర్‌కు చెందిన బేతి మహేందర్ రెడ్డి అనే న్యాయవాది ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఈ ఏడాది మార్చిలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే ఫిర్యాదుకు సంబంధించి తాజాగా కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... 'పెద్దపల్లి జిల్లా ధూళికట్టలో మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భీమ్ దీక్ష పేరుతో చేసిన ప్రతిజ్ఞలో... నేను రాముడిని నమ్మను... కృష్ణుడిని నమ్మను... గణపతిని పూజించను... శ్రాద్ద కర్మలు పాటించను,పిండ దానాలు చేయవద్దు.... అని ప్రమాణం చేశారు. తద్వారా హిందూ దేవీ దేవతలను నమ్మవద్దు,పూజించవద్దని చెప్పారు. ఈ విషయంలో మార్చిలో కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఇప్పుడిదే ఫిర్యాదుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలివ్వడం జరిగింది.' అని తెలిపారు.
ఈ ఏడాది మార్చి 15న పెద్దపల్లి జిల్లా ధూళికట్టలోని బౌద్దక్షేత్రంలో స్వేరోస్ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష ప్రారంభోత్సవం జరిగింది. ఈ దీక్షలో భాగంగా చేసిన బుద్ద వందనం ప్రతిజ్ఞపై వివాదం రాజుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పట్లో బీజేపీ సహా పలు హిందుత్వ సంఘాలు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. అయితే స్వేరో ప్రతినిధులకు గానీ,తనకు గానీ ఆ ప్రతిజ్ఞతో ఎటువంటి సంబంధం లేదని ప్రవీణ్ కుమార్ స్పష్టతనిచ్చారు. స్వేరోయిజంలో అన్ని మతాలు వారు ఉన్నారని... మంచి ఏ మతంలో ఉన్నా స్వీకరిస్తామని తెలిపారు. ఎప్పుడు,ఎక్కడ ఏ మతం పట్ల తాము పక్షపాత వైఖరిని గానీ,వ్యతిరేక వైఖరిని గానీ బోధించమని పేర్కొన్నారు. 1956లో నాగ్‌పూర్‌లోని దీక్ష భూమిలో డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ బుద్దిజం స్వీకరించిన సందర్భంగా చేసిన ప్రతిజ్ఞనే అక్కడ చదివారని వెల్లడించారు.
ప్రవీణ్ కుమార్ వివరణ తర్వాత ఆ వివాదం సద్దుమణిగినిట్లే కనిపించింది. అయితే తాజాగా ఆయన పదవీ విరమణ చేసిన రెండు రోజులకే ఈ వివాదం మళ్లీ తెర పైకి రావడం చర్చనీయాంశంగా మారింది.