అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైన తెలంగాణ తేజం
తెలంగాణకు చెందిన యువ ఇంజినీర్ హనూష దురిశెట్టికి అరుదైన గౌరవం దక్కింది. ఆమె 'రైజింగ్ టెక్నికల్ కంట్రిబ్యూటర్ అవార్డు'కు ఎంపికైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో ఆమె సాధించిన విజయానికి గానూ సొసైటీ ఆఫ్ విమెన్ ఇంజినీర్స్ సంస్థ హనూష దురిశెట్టిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. హనూష దురిశెట్టి హైదరాబాద్ లోని సీబీఐటీ కాలేజీ నుంచి ఇంజినీరింగ్ పట్టా పొందారు. జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు.
తెలంగాణకు చెందిన యువ ఇంజినీర్ హనూష దురిశెట్టికి ప్రతిష్టాత్మక 'రైజింగ్ టెక్నికల్ కంట్రిబ్యూటర్ అవార్డు'కు ఎంపిక చేసింది సొసైటీ ఆఫ్ విమెన్ ఇంజినీర్స్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ప్రొఫెషనల్ సంస్థలో 85 దేశాల నుంచి 47 వేలమంది సభ్యులుగా ఉన్నారు. ఈ అవార్డును యువత ఎవరైతే టెక్నాలజీలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారో వారికి అందజేస్తారు. తమ నూతన ఆవిష్కరణలతో ఇంజినీరింగ్ రంగంలో ప్రతిభను చూపిస్తారో వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేస్తారు.

హనూష తండ్రి డి. రఘుచందర్ ప్రస్తుతం జగిత్యాల జిల్లా డీఎస్పీగా పనిచేస్తున్నారు. కరీంనగర్ కు చెందిన హనూష సీబీఐటీలో బీటెక్ పూర్తి చేశారు. జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను ఉపయోగించి లీగల్ డాక్యుమెంట్స్ ను ఎనలైజ్ చేయడంలో ఆమె ప్రావీణ్యం పొందారు. ది సొసైటీ ఆఫ్ విమెన్ ఇంజినీర్స్ మహిళల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రొఫెషనల్ సంస్థలో 85 దేశాల నుంచి 47 వేలమంది సభ్యులుగా ఉన్నారు. ఏటా ఇంజినీరింగ్ రంగంలో ప్రతిభను చూపిస్తారో వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈసారి తెలంగాణకు చెందిన యువ ఇంజినీర్ హనూష దురిశెట్టికి అరుదైన గౌరవం దక్కడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications