యువతిని నిర్భంధించి పది రోజుల పాటు రేప్, డ్యాన్స్ మాస్టర్‌పై కేసు

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: డ్యాన్స్ ప్రధర్శనల అవకాశం కల్పిస్తామని నమ్మించి ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అక్కా అంటూనే, పెళ్ళి చేసుకోవాలని వేధింపులు, ఎస్ఐ పై దాడికి యత్నం

కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువతి కరీంనగర్ పట్టణంలో ఓ యువకుడి వద్ద డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకొంటుంది. కొంతకాలం పాటు ఆ యువతి పట్ల నిందితుడు బాగానే ఉన్నాడు.

కానీ, కొంత కాలం తర్వాత యువతి పట్ల దుర్భుద్ది పుట్టింది. బాధిత యువతిని లొంగదీసుకొనేందుకు ప్లాన్ చేశాడు. బాధితురాలు డ్యాన్స్ ట్రైనర్ చేతిలో మోసపోయింది. చివరికి అసలు విషయం తెలుసుకొన్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 డ్యాన్స్ శిక్షణతో పేరుతో

డ్యాన్స్ శిక్షణతో పేరుతో

కరీంనగర్ పట్టణానికి చెందిన యువకుడు డ్యాన్స్ ట్రైనింగ్ శిక్షణ ఇస్తున్నాడు. అతడి వద్ద డ్యాన్స్ శిక్షణ కోసం జనగామ జిల్లా తడిగొప్పుల మండలానికి చెందిన ఓ యువతి డ్యాన్స్ శిక్షణ కోసం ఆ యువకుడి వద్ద చేరింది. కొంత కాలం పాటు ఆ యువతికి ఆ యువకుడు శిక్షణ ఇచ్చాడు.

 హైద్రాబాద్‌లో శిక్షణ పేరుతో రేప్

హైద్రాబాద్‌లో శిక్షణ పేరుతో రేప్

ఆ యువకుడు కొంత కాలం పాటు ఆ యువతితో సక్రమంగానే ఉన్నాడు. హైద్రాబాద్‌లో ఆ యువతితో మూడు డ్యాన్స్ ప్రదర్శనలను ఇప్పించాడు. అంతేకాదు బాధితురాలితో హైద్రాబాద్‌లో మరిన్ని డ్యాన్స్ ప్రదర్శనలను ఇప్పించనున్నట్టు నమ్మించి హైద్రాబాద్‌కు పిలిపించుకొని పది రోజుల పాటు నిర్భంధించి బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టు యువతి ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 ఇంటి నుండి గెంటివేత

ఇంటి నుండి గెంటివేత

10 రోజుల పాటు నిర్భంధించి అత్యాచారం చేయడమే కాకుండా, నిందితుడి తల్లి తనను కులం పేరుతో దూషించి ఇంటి నుండి గెంటివేసిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కరీంనగర్ త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు

కేసు నమోదు చేసిన పోలీసులు

బాధితురాలిని నిర్భంధించి అత్యాచారం చేసిన డ్యాన్స్ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదు చేసినట్టు కరీంనగర్ పోలీసులు ప్రకటించారు. మరో వైపు నిందితుడి తల్లి బాధితురాలిని కులం పేరుతో దూషించింది.దీనిపై ఎష్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు కూడ పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karimnagar police registered a case against a dance master for rape on lady.victim complained against him in three town police station at Karimnagar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి