Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాయచూర్‌ను తెలంగాణలో కలపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మొర: స్పందించిన కేటీఆర్

హైదరాబాద్: కర్ణాటకలోని రాయచూర్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ డిమాండ్ చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్‌, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్‌ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్‌ బాగోగులు, సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలుచేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలుచేయాలని.. అలా చేయలేకపోతే.. తెలంగాణలో కలిపేయాలని డిమాండ్‌చేశారు. గతంలోనూ మహారాష్ట్రలోని కిన్వట్‌, మాహోర్‌ తాలూకాలోని పలు గ్రామాల రైతులు నాందేడ్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం కూడా ఇవ్వడం గమనార్హం.

karnataka bjp mla demanded for merge raichur in telangana state: Minister KTR responded

తాజాగా ఇప్పుడు కర్ణాటక ఎమ్మెల్యే శివరాజ్‌ రాయచూర్‌ను తెలంగాణలో కలపాలంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. 'తెలంగాణ ప్రగతికి సరిహద్దులు దాటి వస్తున్న ధ్రువీకరణ. కర్ణాటక బీజేపీ ఎంఎల్‌ఏ రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ఆయన సూచనను ప్రజలు చప్పట్లతో స్వాగతించారు' అని కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ సరిహద్దుని ఆనుకుని ఉంటుందీ రాయచూర్‌ జిల్లా. నిజానికి ఇక్కడి ప్రజలు చాలా రోజులుగా తెలంగాణలో కలవాలనే ఆకాంక్షను సందర్భం వచ్చినప్పుడల్లా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీశాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. కాగా, రాయచూర్‌ జిల్లాలోని శక్తినగర్‌, కల్మల, మల్మరి, గుంజనహళ్లి ప్రాంతాల ప్రజలకు తెలంగాణతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. అయితే అక్కడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు తమకు చేరడం లేదని.. అందుకే తెలంగాణలో కలవాలని చాలారోజులు కోరుకుంటున్నారు. ఒక్క రాయచూర్‌ మాత్రమే కాదు ఇంతకుముందు నాంధేడ్ ప్రజలు కూడా తెలంగాణలో తమను కలుపుకోవాలని ఆందోళనకు దిగారు. అలాగే పోలవరం ముంపు మండలాల ప్రజలు కూడా తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక సరిహద్దు ప్రజలు తెలంగాణలోనే కలిసేందుకు సుముఖత వ్యక్తం చేస్తుండటంపై తెలంగాణ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+