కర్ణాటక ఎన్నికల కౌంటింగ్.. తెలంగాణాలో ఆ పార్టీలకు టెన్షన్; కారణం ఇదే!!
ఈ రోజు ఎనిమిది గంటల నుండి కర్ణాటకలో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏ పార్టీ కర్ణాటకలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి లోనూ చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో కౌంటింగ్ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో టెన్షన్ కొనసాగుతుంది. కర్ణాటక పై పట్టు సాధించేది కాంగ్రెస్ పార్టీనా? లేక బిజెపినా ? అన్నది రెండు ప్రధాన పార్టీల నాయకులలోనూ ఉత్కంఠకు కారణమవుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అయితే సత్తా చాటుతుందో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సత్తా చాటే అవకాశం ఉందని కర్ణాటక ఎన్నికల ఫలితం ప్రభావం తెలంగాణపై కచ్చితంగా ఉంటుందని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ మినహాయించి బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కర్ణాటక ఎన్నికల ఫలితాల పై ఆశలు పెట్టుకున్నాయి.

ఒకవేళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలలో దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని పార్టీలో మరింత జోష్ పెరుగుతుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి, మిగతా రాష్ట్రాలలో విస్తరించడానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉపయోగపడుతుందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి, దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణపై ఉంటుందని భావిస్తున్నారు. అందుకే కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇక ప్రస్తుతం తెలంగాణలో దూకుడు పెంచుతున్న కాంగ్రెస్ పార్టీకి, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితం చావో రేవో అన్నట్లుగా తయారైంది.
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగిస్తే ఖచ్చితంగా దాని ప్రభావం తెలంగాణలో జరగనున్న ఎన్నికలపై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది. కర్ణాటకలో గెలిస్తే ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతుందని, ఆ జోష్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో కూడా కంటిన్యూ అవుతుందని కాంగ్రెస్ అంచనా. పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్పడంతో ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తుంది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఏ విధంగానూ ఉండదని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్, బిజెపిలలో కర్ణాటక ఫలితాలను బట్టి ఏ పార్టీకి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుంది అన్నది అంచనా వేసే పనిలో ఉన్నారు.
ఇక ఏ పార్టీ అంచనాలు ఎలా ఉన్నా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణం అవుతుంది అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. కర్ణాటక రిజల్ట్ ఆధారంగా తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ వర్సెస్ బి ఆర్ ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బిజెపి, లేదా త్రిముఖ పోటీ జరగనుందా అన్నది తెలియనుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications