Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka election result:కర్నాటక పవర్ పాలిటిక్స్..కేసీఆర్ బిగ్ స్కెచ్..!

హైదరాబాద్: కర్నాటక ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ హంగ్ ఏర్పడుతుందని జోస్యం చెప్పడంతో జాతీయ పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్‌ల కన్ను జేడీఎస్‌పై పడింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత కుమారస్వామితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఇటు కాంగ్రెస్ బీజేపీలే కాకుండా అటు కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్ జేడీఎస్‌‌కు అండగా ఉండేందుకు ముందుకొచ్చింది.

ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం హంగ్ ఏర్పడితే గెలిచిన జేడీఎస్ ఎమ్మెల్యేలు చేజారకుండా ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ఆ పార్టీ. 2018 ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయలేదు. దీంతో క్యాంప్ పాలిటిక్స్ తెరపైకొచ్చాయి. నాడు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు ఊపందుకున్నాయి.

Karnataka assembly elections 2023

104 స్థానాలు గెల్చుకున్న బీజేపీ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మ్యాజిక్ ఫిగర్‌ 113 కావాల్సి ఉండటంతో కాంగ్రెస్-జేడీఎస్‌ల నుంచి ఎమ్మెల్యేలను లాక్కుంటారన్న అనుమానంతో రెండు పార్టీల ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. దీంతో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. యడియూరప్ప రాజీనామా చేశారు.

నాడు కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను హైదరాబాదులోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్‌లో పూర్తి పోలీసు భద్రతతో ఉంచారు. ఇందుకు నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంది. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కేసీఆర్ పార్టీ కీలకపాత్ర పోషించింది. అయితే కుమార స్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఏడాది తర్వాత ప్రభుత్వం కూలడంతో తిరిగి బీజేపీ అభ్యర్థి యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

2023 కర్నాటకల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ జేడీఎస్ నేతలైన హె.డీ దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి వారికి బీఆర్ఎస్‌ తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. అంతేకాదు కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఇక కర్నాటకలో జేడీఎస్ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పార్టీ మారుతున్న వేళ నిర్వహించిన సమావేశానికి కుమారస్వామి కూడా హాజరయ్యారు.

అంతకుముందు అక్టోబర్ 5వ తేదీ దసరా రోజున కూడా కుమారస్వామి టీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లు నాడు తీర్మానం చేశారు. ఇక డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం శంకుస్థాపనకు సైతం కుమార స్వామి హాజరై తన సంపూర్ణ మద్దతు కేసీఆర్‌కు ఉంటుందని సంకేతాలు పంపారు. ఆ సమయంలో జేడీఎస్ బీఆర్ఎస్‌లు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు పొత్తులు పెట్టుకోవని సీఎం కేసీఆర్ స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ కూడా పోటీ చేయదని వెల్లడించారు.

ఇదిలా ఉంటే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జేడీఎస్ తరపున సీఎం కేసీఆర్ కానీ, ఇతర నేతలు కానీ ప్రచారం చేయలేదు. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత హంగ్ ఏర్పడితే కాంగ్రెస్‌తో కలిపి జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. హంగ్ ఏర్పడితే జేడీఎస్ కింగ్‌మేకర్ అవుతుందని కేసీఆర్ ఊహించి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు హైదరాబాదులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+