వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక లోకాయుక్త లంచం కేసు: తెలంగాణలో దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త లంచం కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ బృందంలోని పోలీసు అధికారులు పలువురిని విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. లోకాయుక్త లంచం డిమాండ్ కేసులో తప్పించుకుని తిరుగుతున్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని సిట్ అధికారులు అంటున్నారు.

ఈ కేసులోని నిందితులు కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తలదాచుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సిట్ అధికారులు ఈ కేసు దర్యాప్తు చేసి ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని అతి త్వరలో అరెస్టు చేస్తామని అంటున్నారు. తెలంగాణలో ఒక బృందం దర్యాప్తు చేస్తున్నది.

 Karnataka Lokayukta Corruption Case

అయితే అరెస్టు అయిన వారు, తప్పించుకుని తిరుగుతున్న వారి నుండి బెదిరింపులకు గురైన అధికారులు స్వచ్చందంగా దర్యాప్తు చేస్తున్న అధికారుల ముందు హాజరై వివరాలు వెల్లడిస్తున్నారు. వారిని సాక్షులుగా పరిగణిస్తామని సిట్ అధికారులు అంటున్నారు.

నిందితులు నగదు వసూలు చెయ్యడానికి పలువురు అధికారుల పేర్లు దుర్వినియోగం చేశారని వెలుగు చూసింది. అలాంటి అధికారులను తాము సంప్రదించి వివరాలు సేకరిస్తున్నామని సిట్ అధికారులు అంటున్నారు. లోకాయుక్త ను అడ్డం పెట్టుకుని అధిక మొత్తంలో లంచాలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

English summary
The Special Investigation Team (SIT) arrested three accused in connection with the alleged corruption case in Karnataka Lokayukta.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X