కుమారుడి అరెస్టు: దీర్ఘకాలిక సెలవుపై కర్ణాటక లోకాయుక్త భాస్కర్ రావ్
బెంగళూరు: రూ. కోటి లంచం డిమాండ్ కేసులో కుమారుడు అశ్విన్ రావ్ అరెస్టు కావడంతో కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ 15 రోజులు లాంగ్ లీవ్ పెట్టి వెళ్లి పోయారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ను అధికారులు విచారణ చేస్తున్నారు. భాస్కర్ రావు తెలంగాణకు చెందినవారనే విషయం తెలిసిందే.
లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ను ఎస్ఐటి అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేసి బెంగళూరు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తరువాత అశ్విన్ రావ్ ను లోకాయుక్త న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
అశ్విన్ రావ్ ను విచారణ చెయ్యడానికి తమ కస్టడికి ఇవ్వాలని ప్రత్యేక బృందం పోలీసు (సిట్) అధికారులు కోర్టు ముందు మనవి చేశారు. 9 రోజుల పాటు అశ్విన్ రావ్ ను విచారణ చెయ్యడానికి లోకాయుక్త న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

అంతకు ముందు భాస్కర్ రావ్ రాజీనామా చెయ్యాలని మూడు రోజుల పాటు వివిద సంఘాల నాయకులు రాజ్ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. కార్యాలయానికి వెళ్తే లేనిపోని సమస్యలు వస్తాయని భాస్కర్ రావ్ మూడు రోజులు సెలవు పెట్టారని ప్రచారం సాగుతోంది.
కుమారురు అశ్విన్ రావ్ అరెస్టు కావడంతో భాస్కర్ రావ్ 15 రోజులు సెలవు మీద వెళుతున్నానని లోకాయుక్త తాత్కాలిక రిజిస్టార్ టి. గోపాలకృష్ణకు సమాచారం అందించారు. భాస్కర్ రావ్ బెంగళూరులోని ఆయన నివాసం లో లేరని, ఆయన హైదరాబాద్ వెళ్లి ఉంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు.












Click it and Unblock the Notifications