రూ. కోటి లంచం: లోకాయుక్త జస్టిస్ రాజీనామా

బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ ఎట్టకేలకు ఆయన పదవికి రాజీనామా చేశారు. లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ రాజీనామాను కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాల మంగళవారం అంగీకరించారు. భాస్కర్ రావు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందినవారనే విషయం తెలిసిందే.

లోకాయుక్తలో రూ. కోటి లంచం డిమాండ్ చేశారని విషయం వెలుగు చూసింది. ఇదే కేసులో భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ ను జులై 27వ తేదిన ప్రత్యేక బృందం పోలీసులు (ఎస్ఐటి) అరెస్టు చేశారు.

అశ్విన్ రావ్ అరెస్టు అయిన తరువాత లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ అప్పటి నుంచి నాలుగు సార్లు సెలవులు పెట్టారు. జులై 17 నుంచి ఆగస్గు 17 వరకు, ఆగస్గు 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు సెలవు పెట్టారు.

Read More: ఎవరీ కర్ణాటక లోకాయుక్త?: కరీంనగర్ నుంచి కర్ణాటక దాకా..

Karnataka Lokayukta justice Y.Bhaskar Rao resigned

తరువాత సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 21 వరకు, అక్టోబర్ 21 నుంచి 45 రోజుల పాటు సుదీర్ఘ సెలవులు పెట్టారు. మొత్తం 135 రోజులు సెలవులో ఉన్నారు. అయితే భాస్కర్ రావ్ ను ఆపదవి నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు వచ్చారు.

శాసన సభ్యులు, ఎంఎల్ సీలు సంతకాలు చేసి విదాన సభలో స్పీకర్ కాగోడు తిమ్మప్పకు, విదాన పరిషత్ అధ్యక్షుడు డి.హెచ్. శంకరమూర్తికి అందించారు. విదాన సభ, విదాన పరిషత్ లో భాస్కర్ రావ్ ను లోకాయుక్త న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని శాసన సభ్యులు, ఎంఎల్ సీలు తీర్మానించారు.

Karnataka Lokayukta justice Y.Bhaskar Rao resigned

ఇదే సందర్బంలో సోమవారం భాస్కర్ రావు రాజ్ భవన్ చేరకుని గవర్నర్ వాజుబాయ్ వాలకు రాజీనామా లేఖను అందించారు. మంగళవారం గవర్నర్ వాజుబాయ్ వాల రాజీనామాను అంగీకరించారని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి టి.బి. జయచంద్ర తెలిపారు.

హైదరాబాద్ కు చెందిన భాస్కర్ రావ్ గతంలో కర్ణాటక హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి రిటైడ్ అయ్యారు. తరువాత కర్ణాటక లోకాయుక్త జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కుమారుడు అశ్విన్ రావ్ పలువురు ప్రభుత్వ ఉద్యోగులను లంచం ఇవ్వాలని లేదంటే లోకాయుక్త దాడులు చేస్తుందని బెదిరించారని ఆరోపణలు రావడంతో కేసులు నమోదు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+