రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. ఎందుకంటే!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎమర్జెన్సీ మీటింగ్ ల పేరుతో పిలిచి క్లాస్ పీకుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? ప్రజాక్షేత్రంలో ప్రజలమద్దతు కూడగట్టడానికి ప్రజా ప్రతినిధులు చెయ్యాల్సింది ఏంటి? అనేది సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మళ్లీ మరోమారు బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించడానికి కేసీఆర్ రెడీ అయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ రేపు ఈ ఎమర్జెన్సీ మీటింగుకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఈసారి సీఎం కేసీఆర్ సమావేశంలో ఏం చెప్పబోతున్నారు? ఎన్నికలను ఉద్దేశించి ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? ఎవరి పై బాంబు పేల్చనున్నారు? అన్నది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ.

మొన్నటి వరకు సీఎం కేసీఆర్ తో సమావేశం అంటే ముందస్తు ఎన్నికలకు వెళతారా అన్న అనుమానం ప్రతి ఒక్కరి లో ఉండేది. అయితే ప్రస్తుతం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని క్లారిటీ రావడంతో కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న భేటీలో ఆయన ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికలకు కేసీఆర్ రూటు మారుస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు మారతాయని అంచనా వేస్తున్న క్రమంలో రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కెసిఆర్ నిర్వహించనున్న భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. రేపు జరగనున్న ఈ భేటీలో ముఖ్యంగా కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో దూకుడు పెంచే అవకాశం ఉందన్న అంశంపైన కూడా ఫోకస్ చేయనున్నట్టు సమాచారం.
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వచ్చే ఎన్నికలకు సమర శంఖారావం పూరించే వేదికలుగా మార్చుకోవడం వంటి అనేక అంశాలపై నేతలతో చర్చించనున్నారు అని తెలుస్తుంది.












Click it and Unblock the Notifications