Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుకు మరో బిగ్ షాక్ - కిం కర్తవ్యం..!?

తెలంగాణ ఎన్నికల రాజకీయం వేగంగా మారుతోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిది. ఈ నిర్ణయం పైన టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని గుర్రగా ఉన్నారు. పోటీకి సిద్దం కావాలని చెప్పి..జాబితా తయారు చేసిన తరువాత పోటీ నుంచి విరమించుకోవటం పైన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని గుర్తించిన బీఆర్ఎస్..కాంగ్రెస్ ముఖ్య నేతలు కాసానితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు కాసాని నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.

మారుతున్న సమీకరణాలు:తెలంగాణ టీడీపీలో ప్రస్తుత ఎన్నికల కోసమే ఏడాదిన్నార కాలంగా కసరత్తు జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడిగా కాసాని నియామకం తరువాత పార్టీ ఖమ్మంలో సభ నిర్వహించింది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ సభల నిర్వహణకు కసరత్తు చేసింది. ఎన్నికల కోసం చంద్రబాబు సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత తొలి సారి జైలులో ములాఖత్ అయిన కాసాని అధ్యక్షుడు సూచనల మేరకు పోటీకి సిద్దంగా ఉన్న ఆశావాహులతో జాబితా సిద్దం చేసారు. నందమూరి బాలయ్య తాను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. కానీ, చంద్రబాబు నిర్ణయం మార్చేసారు. అసలు ఎన్నికల్లో పోటీ వద్దని తేల్చి చెప్పారు. దీంతో, కాసాని మనస్థాపానికి గురయ్యారు.

Kasani Gnaneswar likely to resign for TTDP,offers from Congress and BRS parties

కాసాని టీడీపీ వీడుతారా:రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలో కొనసాగినా ఉపయోగం లేదంటూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ లో కాసాని సుదీర్ఘ కాలం పని చేసారు. ఇక, ఇప్పుడు కాసాని పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే సమాచారంతో బీఆర్ఎస్..కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈటెల పార్టీ వీడటంతో ఇప్పుడు పేరున్న ముదిరాజ్ నేతలు బీఆర్ఎస్ కు అవసరం. దీంతో, కాసాని పార్టీలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం లేదా అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇస్తామని బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

Kasani Gnaneswar likely to resign for TTDP,offers from Congress and BRS parties

రెండు పార్టీల నుంచి ఆఫర్లు:ఇటు కాంగ్రెస్ నుంచి కాసానితో పార్టీ నేతలు టచ్ లోకి వచ్చారని సమాచారం. కాంగ్రెస్ లో చేరటం ద్వారా మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు హామీ వచ్చిందని చెబుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వరుసగా ఈ స్థానంలో ఓడిపోయింది. ప్రస్తుతం మల్కాజ్ గిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న రేవంత్ అక్కడ గెలిస్తే మల్కాజ్ గిరికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

కాసాని తమ పార్టీలోకి వస్తే టీడీపీ -కాంగ్రెస్ మధ్య అవగాహన గురించి ప్రచారం చేయించాలనేది గులాబీ నేతల వ్యూహం. టీడీపీ మద్దతు దారులు కాంగ్రెస్ వైపు చూస్తుంటంతో కాసాని తమ పార్టీలోకి వస్తే తమకు కలిసి వస్తుందనేది కాంగ్రెస్ నేతల అంచనా. దీంతో, ఇప్పుడు కాసాని పార్టీ మార్పు నిర్ణయం..ఎటు వైపు అడుగులు వేస్తారనేది వేచి చూడాలి.సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+