హైదరాబాద్ యూత్ అసెంబ్లీలో ఎంపి కవిత(పిక్చర్స్)
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన హైదరాబాద్ యూత్ అసెంబ్లీ కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్యం అందడంలేదని, ఈ పరిస్థితిని మార్చాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు ముందుకు రావాలని అన్నారు. అలాంటి వైద్యులకు ఎక్కువ వేతనం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
దేశంలో మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా బేటీ బచావో.. బేటీ పడావో అంటూ నినాదం ఇచ్చారని ఎంపీ కవిత గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ఇందులో భాగంగా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ప్రతినిధులు కృష్ణసాయి, తేజస్వి, అలోక్ జైస్వాల్, భార్గవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎంపి కవిత
గ్రామీణ ప్రాంతాల్లోనూ నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.

ఎంపి కవిత
స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన హైదరాబాద్ యూత్ అసెంబ్లీ కార్యక్రమానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎంపి కవిత
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్యం అందడంలేదని, ఈ పరిస్థితిని మార్చాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి వైద్యులు ముందుకు రావాలని అన్నారు. అలాంటి వైద్యులకు ఎక్కువ వేతనం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఎంపి కవిత
దేశంలో మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా బేటీ బచావో.. బేటీ పడావో అంటూ నినాదం ఇచ్చారని ఎంపీ కవిత గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications