కేంద్రం సహకరించడం లేదని కవిత: సహకరిస్తామని వెంకయ్య
హైదరాబాద్/ న్యూఢిల్లీ: తమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సరియైన సహకారం అందించడంలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ర్టానికి నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణమంత్రి తలసాని అంశంపై స్పీకర్‌దే తుది నిర్ణయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ టిఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. తలసాని శ్రీనివాస రావు శాసనసభా సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ ఇప్పటి వరకు కూడా ఆమోదించలేదు. దానిపై వివాదం చెలరేగుతోంది.

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీ మున్సిపాల్టీల పనితీరును పరిశీలించేందుకు రాష్ట్రం నుంచి వచ్చిన బృందం ఇవాళ తనను సంప్రదించిందని తెలిపారు. ఈ బృందం తనతో అన్ని అంశాలను పంచుకుందని పేర్కొన్నారు.
చెత్త నుంచి విద్యుత్, ఎరువుల తయారీకి సంబంధించిన అంశాలపై సూక్ష్మంగా చర్చ జరిగిందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్రంతో కలిసి పనిచేయాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications