కవిత కొత్త కార్యాలయం - కేసీఆర్ కోసం ధర్నా, కేటీఆర్ ఫిక్స్..!!
ఎమ్మెల్సీ కవిత తగ్గేదే లే అంటున్నారు. దూకుడు కొనసాగిస్తున్నారు. కవిత వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటోంది. కేటీఆర్ టార్గెట్ గా తన కార్యాచరణ కు పదును పెడుతున్నారు. తన భవిష్యత్ రాజకీయ వేదికను బలోపేతం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తన తండ్రికి మద్దతుగా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరోక్షంగా తన అన్న కేటీఆర్ ను ఫిక్స్ చేస్తున్న కవిత తదుపరి అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. తండ్రి పైన విధేయత చూపిస్తునే.. అన్న పైన పోరాటనికి సిద్దమయ్యారు.
లేఖతో రాజకీయ సంచలనంగా మారిన కవిత వరుస నిర్ణయాలతో దూకుడు పెంచారు. తన తండ్రి కేసీఆర్.. బీఆర్ఎస్ ను కాపాడుకోవటం తన లక్ష్యమని చెబుతున్న కవిత రాజకీయ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కవిత లేఖ తరువాత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రాంగం సాగించారు. కవిత వ్యవహారంలో వేచి చూసే ధోరణితో కనిపిస్తున్నారు. అటు ఈ వ్యవహారంలో కేటీఆర్ లక్ష్యంగా కవిత అడుగులు స్పష్టంగా ఉన్నాయి. కేటీఆర్ వ్యూహాత్మకంగానే ఈ సమయం లో విదేశీ పర్యటనకు వెళ్లారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్లకే పరిమితం అవుతారా అంటూ తన అన్న ను టార్గెట్ చేసిన కవిత.. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఆందోళనలు చేయరా అంటూ నిల దీసారు. ఇప్పుడు తానే ఆ పనికి సిద్దమయ్యారు.

కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతల నుంచి తనకు మద్దతు లేకపోవటం.. తన అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటంతో తన సొంత సంస్థ జాగృతి నుంచి తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తన ఇంటి వద్దే కొత్తగా జాగృతి ప్రధాన కార్యాలయం ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో తన తండ్రి కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అన్న చేయలేనిది తాను చేసి చూపిస్తానే విధంగా ఈ నిర్ణయంతో కవిత నేరుగా రంగంలోకి దిగుతున్నారు. కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టులో అక్రమాల పై విచారణ కోసం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. దీనికి నిరసనగా కవిత జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు నిర్ణయించారు. ఇది ఒక విధంగా కేటీఆర్ ను ఫిక్స్ చేయటమే. ఇదే సమయంలో కేటీఆర్ కంటే తాను సమర్ధురాలినని నిరూపించుకునే ప్రయత్నం లో కవిత ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications