బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. తెలంగాణ జాగృతి విజయం: ఎమ్మెల్సీ కవిత
ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీసీ సమాజం సాధించిన విజయం అని ఎమ్మెల్సీ కవిత పేరొన్నారు. ఇది తెలంగాణ జాగృతి మరో విజయంగా ఆమె అభివర్ణించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో సాగించిన ఉద్యమాలకు రేవంత్ సర్కారు దిగొచ్చిందని కవిత అన్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో సాగించిన ఉద్యమాలకు రేవంత్ సర్కారు దిగొచ్చిందని కవిత అన్నారు. 42 శాతం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు పోతే ఊరుకునేది లేదని తాము ఇప్పటికే ప్రకటించినట్లు ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి.. ఇదే డిమాండ్ తో జూలై 17న రైలు రోకో ప్రకటించిదని కవిత తెలిపారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీలకు జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతితో కలిసి బీసీ సంఘాల నేతలు, మేధావులు గళమెత్తారని ఆమె చెప్పుకొచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లకూడదని దిల్లీలో సైతం డిమాండ్ వినిపించినట్లు కవిత పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా రేవంత్ రెడ్డి సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని రాహుల్ గాంధీని సైతం డిమాండ్ చేశామని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
ఇందిరా పార్కు వేదికగా నిర్వహించిన ధర్నాలో, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే డిమాండ్ చేశారు. కౌన్సిల్ ప్రత్యేక సమావేశాల్లో సైతం తన బాణీని బలంగా వినిపించి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టినట్లు కవిత తెలిపారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీసీ సమాజం సాధించిన విజయం అని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి తరఫున నివేదిక అందజేశారు ఎమ్మెల్సీ కవిత. బీసీ సంఘాల నాయకులు.. ప్రభుత్వం చేపట్టిన కులగణలో పాల్గొని తన వివరాలు అందజేశారు.
బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత ఉద్యమాల క్రమం..
26 జనవరి 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, హైదరాబాద్
06 ఫిబ్రవరి 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, వరంగల్
06 ఫిబ్రవరి 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, కరీంనగర్
07 ఫిబ్రవరి 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, వికారాబాద్
11 మార్చ్ 2024 - రౌండ్ టేబుల్ సమావేశం, నల్గొండ
25 నవంబర్ 2024 - డెడికేటెడ్ బీసీ కమీషన్ కు సమగ్ర నివేదిక
2 డిసెంబర్ 2024 - పద్మశాలి సంఘంతో సమావేశం
6 డిసెంబర్ 2024 - జోగి కుల సంఘంతో సమావేశం
7 డిసెంబర్ 2024 - మ్యాదరి సంఘంతో సమావేశం
11 డిసెంబర్ 2024 - వడ్డెర సంఘంతో సమావేశం
12 డిసెంబర్ 2024 - వంశరాజ్, సగర ఉప్పర & రజక సంఘాలతో సమావేశం
12 డిసెంబర్ 2024 - బీసీ సంఘాలతో విస్తృత స్థాయి సమావేశం
24 డిసెంబర్ 2024 - ముదిరాజ్ సంఘం & విశ్వకర్మ సంఘాలతో సమావేశం
26 డిసెంబర్ 2024 - శాలివాహన కుమ్మర సంఘం & అరె కటిక సంఘాలతో సమావేశం
26 డిసెంబర్ 2024 బీసీ సంఘాలతో ఉద్యమ కార్యాచణపై సమావేశం
27 డిసెంబర్ 2024 - నిజామాబాద్ BC సంఘాల ఆధ్వర్యంలో - పూసల, ముదిరాజ్, పద్మశాలి, మొండి బండ, రజక, నాయి బ్రాహ్మణ, కురమ, యాదవ, గౌడ్, దాసరి, జంగమ, నకాశి, రెడ్డిక, వీర శైవ, మున్నూరుకాపు, పెరిక, మేరు సంఘ నాయకులు.

03 జనవరి 2025 ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
23 జనవరి 2025 ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ
15 ఫిబ్రవరి 2025 రౌండ్ టేబుల్ సమావేశం, ఖమ్మం
28 ఫిబ్రవరి 2025 రౌండ్ టేబుల్ సమావేశం, నాగర్ కర్నూలు
29 మార్చ్ 2025 - రౌండ్ టేబుల్ సమావేశం, కామారెడ్డి
17 జూన్ 2025 - రౌండ్ టేబుల్ సమావేశం, మెదక్
బీసీ బిల్ కోసం జూలై 17న రైల్ రోఖో ప్రకటన.
I welcome the State Cabinet’s decision to hold local body elections only after providing for 42% reservation for backward classes by amending the existing Act.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 10, 2025
Necessary steps in this regard should be initiated immediately.The state government’s decision is a clear victory for…
22 జూన్ 2025న రైల్ రోకో కు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరుతూ సమావేశం
11 ఏప్రిల్ & 24 జూన్ తేదీలలో సీపీఎం రాష్ట్ర కార్యాలయంకు కవిత - మద్దతు కోరుతూ వినతి
24 జూన్ 2025 - న్యూడెమోక్రసీ కార్యాలయంకు ఎమ్మెల్సీ కవిత
27 జూన్ 2025 - కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తో ఎమ్మెల్సీ కవిత నివాసంలో సమావేశం - బీసీ రిజర్వేషన్లు కోరుతూ వినతి పత్రం ఇవ్వడం
08 జూలై 2025 - న్యూఢిల్లీ కాన్ స్టిట్యూషన్ క్లబ్ లో జాతీయ మీడియాతో పత్రికా సమావేశం - జూలై 17న రైల్ రోఖో చేస్తున్నామని పునరుద్ఘాటన












Click it and Unblock the Notifications