బోనమెత్తినా శిగమెందుకు రాలేదు: కవితపై పొన్నం విసుర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత అధికారులను అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎంపీ కవిత ఎన్ని సార్లు బోనం ఎత్తినా ఆమెకు పూనకం ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. పంజాబ్ కాల్పులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇదిలావుంటే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఓట్లను తొలగించాలని చూస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆధార్ లింక్ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పిందని, ఓటర్ల పేర్లను తొలగిస్తే దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. యాకూబ్ ఉరిశిక్షను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఉగ్రవాదులకు, మతానికి సంబంధం లేదన్నారు.
లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయాలంటూ ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టింది. సీఎం వైఖరికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.












Click it and Unblock the Notifications