కవిత ఎపిసోడ్ లో కీలక మలుపు, తాజా డిమాండ్..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కవిత లేఖ బీఆర్ఎస్ లో సంచలనంగా మారింది. కేటీఆర్ లక్ష్యంగా కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. తండ్రి కేసీఆర్ కు మద్దతుగా నిలుస్తూ నే కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు.. పార్టీ మార్పుకు ఛాన్స్ లేదని కవిత క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వేదిక నుంచి కాకుండా జాగృతి సంస్థ పేరుతో కవిత ధర్నా చేసారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉన్నారు. కవిత కార్యాచరణను కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారు.
ఎమ్మెల్సీ కవిత వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. కవిత బీఆర్ఎస్ వీడుతున్నారనే ప్రచారానికి ముగింపు దొరికింది. బీఆర్ఎస్ లో యాక్టివ్ గా వ్యవహరించిన కవిత.. ఇప్పుడు తన తండ్రి కోసం తన సొంత సంస్థ జాగృతి ద్వారా ధర్నా నిర్వహించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్ లో స్పందిస్తే సరి పోతుందా అంటూ కేటీఆర్ ను కవిత ఇప్పటికే టార్గెట్ చేసారు. ఇప్పుడు తన తండ్రి కోసం ధర్నా చేసారు కేసీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇచ్చిందని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు, నిధులు తీసుకురావటం కేసీఆర్ చేసిన తప్పా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజులు కాదని.. 21పంపు హౌస్‌లు, కాళేశ్వరంతో 35శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు.

కవిత చేసిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు.. రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని సహించమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు ఏపీకి గోదావరి జలాలను తరలిం చుకుపోతుంటే.. మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదా అని నిలదీశారు. వెంటనే రేవంత్‌రెడ్డి.. అపెక్స్ కౌన్సిల్, కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణ మేనని తెలిపారు. కుంగిన మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు మీద ఆధారపడి బీజేపీ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గోదావరిలో వెయ్యి టీఎంసీల నీళ్లు వచ్చేవరకు జాగృతి ఆధ్వర్యం లో ఉద్యమం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.












Click it and Unblock the Notifications