మోడీతో కవిత సెల్ఫీ: వెంకయ్యనాయుడు వద్దకు ఏపీ-టి ఎంపీలు
టీఆర్ఎస్ ఎంపి కవిత, మరికొందరు ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానిని కవిత కోరారు.
న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపి కవిత, మరికొందరు ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానిని కవిత కోరారు.
పసుపు బోర్డు ఏర్పాటుపై పలువురు ముఖ్యమంత్రులు రాసిన లేఖలను ప్రధాని మోడీకి కవిత అందించారు. ఆయనతో సెల్ఫీలు దిగారు. అనంతరం ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుతో భేటీ అయ్యారు.

వెంకయ్యను కలిసిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడుతో రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు భేటీ అయ్యారు. టిడిపి, వైసిపి, టిఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో ఆయనను కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications