ప్రజల కోణంలో..ప్రజల కోసం..కొత్త రాజకీయ శక్తిగా కవిత..!

కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సభకు వచ్చిన జనం, వారి స్పందన చూస్తుంటే కవిత పార్టీ పట్ల జనాల్లో క్రమంగా ఆదరణ పెరుగుతోందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఆమె అత్యంత పకడ్బందీగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఓ వైపు ప్రజాసమస్యలపై పోరాటాలు... మరోవైపు పార్టీ సిద్దాంతాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. ఎక్కడ కూడా తత్తరపాటు, తొందరపాటు ఆమె లో కనిపించడం లేదు.

తెలంగాణకు ఏమీ కావాలో, తెలంగాణ ఏమీ కోరుకుంటుందో దానిపైనే తాను ఫోకస్ చేస్తోంది. వ్యక్తిగత విమర్శలు లేవు, అనవసర హంగామా అసలే లేదు. ఎక్కడకు వెళ్లిన తెలంగాణ ప్రజలకు మేలు చేయటం పైనే ధ్యాస. సామాజిక న్యాయ తెలంగాణ, ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, మహిళా సాధికారత, సర్వోదయ తెలంగాణ ఇవే ఆమె నోటి వెంట వస్తున్న మాటలు. ఈ మాటలే ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. తాము ఏమీ కోరుకుంటున్నామో, తమ బాధలు ఏంటో కవిత మాత్రమే అర్థం చేసుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. అందుకే రోజు రోజుకు ఆ పార్టీ పట్ల జనాల్లో విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది.

kavithas-new-political-roadmap-bahujan-telangana-social-justice-and-women-s-empowerment

రాజకీయాలంటేనే సవాళ్లు, బూతులు, అబద్దపు హామీలు, హంగామాగా మార్చేసిన నాయకులకు ఇప్పుడు కవితకు వస్తున్న ఆదరణ చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే పురిట్లోనే ఆ పార్టీ గొంతు నులిమేయాలని కట్టుకథలు షురూ చేశారు. ఒకరు బీఆర్ఎస్ వదిలిన బాణం అంటే... మరొకరు కాంగ్రెస్ వదిలిన బాణం అంటారు. ఎందుకంటే కవిత ఎక్కుపెట్టే ఆ బాణం తమ సామ్రాజ్యాన్ని ఎక్కడ కూల్చేస్తుందోనన్న దిగులు వారిది. అందుకే ఈ అబద్దపు ప్రచారాలు. ఇలాంటి కుట్రలతో తొక్కి పెట్టాలని చూస్తే భయపడే వ్యక్తా కవిత? కుట్రలనే ఎక్కుపెట్టి చీల్చి చెండాడే శివంగి తను. శివంగి వేట ఎలా ఉంటుందో కోస్గీ పాంచజన్య సంకల్ప సభ లో ట్రయిలర్ చూపించింది. మహామహులైన మగ రాజకీయ నాయకులకే సవాల్ విసిరింది. ఎలాంటి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎలా సక్సెస్ కాబోతుందో బల్లగుద్ది మరీ చెప్పింది. బహుజన వాదం, మహిళ సాధికారిత, సామాజిక న్యాయ తెలంగాణ అనే ఆయుధాలతోనే తన పోరాటం ఉంటుందని స్పష్టం చేసింది.

నేను బహుజనుల బాణాన్ని.. సీఎం రేవంత్ అడ్డాలో TRS చీఫ్ కవిత సవాల్
నేను బహుజనుల బాణాన్ని.. సీఎం రేవంత్ అడ్డాలో TRS చీఫ్ కవిత సవాల్

తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం సామాజిక న్యాయ తెలంగాణ కోసం చేయాల్సిన పోరాటం మిగిలే ఉందన్నది కవిత ఎప్పుడు చెప్పే మాట. ఐతే ఆ బాటలో పయనించాల్సిన ప్రధాన పార్టీలన్నీ దారి తప్పాయి. అందుకే ఆ బాధ్యతను ఇప్పుడు కవితే తన భుజాన వేసుకుంది. కోస్గీ సభ ద్వారా సామాజిక తెలంగాణ ఆకాంక్ష తనలో ఎంత బలంగా ఉందో చెప్పే క్రమంలో తాను బహుజన వాదాన్ని అంటూ ఆమె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. సామాజికంగా వెనుకబడిన వర్గాల విషయంలోనే కాదు శతాబ్దాలుగా అణిచివేయబడిన మహిళల గొంతుక కూడా తాను అని కవిత చెబుతున్నారు. సాయిత్రి భాయ్ ఫూలే ఆశయాలను నింపుకున్న వీర వనితను అంటూ తాను చేసిన ప్రకటన ద్వారా మహిళల కోసం ఎంత బలంగా నిలవబోతున్న అన్నది కవిత చెప్పకనే చెప్పారు.

ఈ దేశంలో పితృస్వామ్య వ్యవస్థను కూడా కవిత ప్రశ్నించారు. ఎంత గొప్ప గొప్ప నాయకులైన సరే...మహిళల విషయంలో మాట్లాడేది ఒకటి చేసేది ఒకటంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రాజకీయ అవకాశాలు ఇవ్వటంలో తీవ్ర వివక్ష ఉందన్నది లెక్కలతో సహా వివరిస్తూనే ఉన్నారు. 29 రాష్ట్రాలున్న ఈ దేశంలో ఒకే రాష్ట్రానికి మహిళ ముఖ్యమంత్రి ఉండటం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం యాచిస్తే కాదు శాసిస్తేనే దక్కుతుందన్నది ఆమె నిశ్చితాభిప్రాయం. అలా శాసించాలంటే మహిళల కోసం మాట్లాడే రాజకీయ పార్టీ ఉండాలని చెబుతున్నారు. ఆ రాజకీయ పార్టీ తనదేనని కూడా మహిళలకు భరోసా ఇస్తున్నారు. పితృస్వామ్య వ్యవస్థ నుంచి మాతృస్వామ్య వ్యవస్థ రావాలంటే మహిళలందరినీ ఒక్క తాటిపైకి తేవాలన్న సంకల్పం తనదని చెబుతున్నారు.

కుల గణనలో బీసీలకు అన్యాయం జరగొద్దు.. కేంద్రానికి కల్వకుంట్ల కవిత వార్నింగ్!
కుల గణనలో బీసీలకు అన్యాయం జరగొద్దు.. కేంద్రానికి కల్వకుంట్ల కవిత వార్నింగ్!

బహుజనులు, మహిళల కోసం ఒక పార్టీ ఉందన్న భరోసా ఇవ్వటం కవితకు ప్లస్ పాయింట్ గా మారింది. అందుకే ఆమె ఎక్కడికి వెళ్లిన సరే మహిళల నుంచి ఘనస్వాగతం లభిస్తోంది. వారంతా కవిత పార్టీని ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ దేశంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలంటూ ఆయా వర్గాల కోసం పార్టీలు వచ్చాయో తప్ప మహిళలు సెంట్రిక్ గా ఉన్న పార్టీ లేదు. అందుకే మహిళలందరినీ ఒక్కటి చేసే విధంగా కవిత చేస్తున్న ప్రయత్నం భవిష్యత్ లో మహిళలు రాజకీయాల్లో కీలకంగా ఉండేందుకు ఎంట్రీ పాస్ కానుంది. బహుజన వాదం, సామాజిక న్యాయ తెలంగాణ, మహిళలకు రాజకీయ అవకాశాల కోసం టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నం ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటం కచ్చితంగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందనడంలో సందేహం లేదు.

- వ్యాసకర్త
పవన్ రావు పునుగోటి (టీఆర్ఎస్ నాయకులు,జగిత్యాల నియోజకవర్గం ఇంఛార్జ్)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+